Friday, December 20, 2024

వరంగల్ బిఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థిగా మారేపల్లి సుధీర్ కుమార్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : వరంగల్ బిఆర్‌ఎస్ లోక్‌సభ అభ్యర్థిగా హన్మకొండ జిల్లా పరిషత్ ఛైర్మన్ డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ పేరును పార్టీ అధినేత కెసిఆర్ ప్రకటించారు. హన్మకొండ జిల్లా వాసి, మాదిగ సామాజికవర్గానికి చెందిన సుధీర్ కుమార్ హన్మకొండ జిల్లా పరిషత్ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. 2001 నుంచి తెలంగాణ ఉద్యమకారుడిగా ఉన్నారు. పార్టీకి విధేయుడిగా, అధినేతతో కలిసి పని చేస్తున్న సుధీర్ కుమార్ సరైన అభ్యర్థిగా ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ ముఖ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. నేతలతో చర్చించి వారి సలహాలు, సూచనల మేరకు సుధీర్ కుమార్ అభ్యర్థిత్వాన్ని కెసిఆర్ ఖరారు చేసి ప్రకటించారు.

కడియం కావ్య పోటీ నుంచి తప్పుకోవడంతో బిఆర్‌ఎస్ మరో అభ్యర్థిని ఖరారు చేయాల్సి వచ్చింది. సుధీర్ కుమార్‌తో పాటు పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి. మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య పేరు కూడా చర్చకు వచ్చింది. శుక్రవారం వరంగల్ జిల్లా బిఆర్‌ఎస్ నేతలతో సమావేశమైన కెసిఆర్, అందరితో చర్చించి వరంగల్ లోక్‌సభ స్థానానికి పార్టీ అభ్యర్థిగా సుధీర్ కుమార్ పేరును ప్రకటించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News