Monday, January 20, 2025

మెడికో ప్రీతి కేసులో నిందితుడు సైఫ్‌కు బెయిల్..

- Advertisement -
- Advertisement -

ఖమ్మం : రాష్ట్రంలో సంచలనం స్రష్టించిన వరంగల్ జిల్లాకు చెందిన మెడికో ప్రీతి మృతి కేసులో నిందితుడు సైఫ్ ఖమ్మం జిల్లా జైల్ నుంచి విడుదల అ య్యాడు. ఆయనకు బుధవా రం షరతులతో కూడిన బెయిల్‌ను వరంగల్ కోర్టు మంజూరు చేసింది. రూ.10 వేల బాండ్, ఇద్దరి పూచీకత్తుపై బెయిల్ ఇచ్చింది. అయితే సకాలంలో బెయిల్ ఫేపర్లు అందకపోవడం జైలు అధికారులు విడుదల చేయలేదు. మళ్ళీ రిమాండ్ కోసం గురువారం ఉదయం వరంగల్ న్యాయ స్థానానికి తీసుకెళ్లారు.

బెయిల్ పత్రాలు పూర్తిగా సమర్పించడంతో వరంగల్ నుంచి ఖమ్మం జైలుకు తీసుకొచ్చి అనంతరం గురువారం సాయంత్రం ఖమ్మం దానవాయిగూడెం జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు.సైఫ్ విడుదల కోసం ఆయన కుటుంబ సభ్యులు ఉదయం నుంచి సాయంత్ర వరకు పడిగాపులు కాశారు.ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు విచారణ అధికారి ఎదుట హాజరుకావాలని కోర్టు షరతు విధించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News