Monday, December 23, 2024

బండి సంజయ్‌కి వరంగల్ సిపి రంగనాథ్ సవాల్

- Advertisement -
- Advertisement -

నేను సెటిల్మెంట్లు చేశానా.. నిరూపించండి 

వరంగల్ : తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపణలపై వరంగల్ సీపీ రంగనాథ్ స్పందించారు. ఆయన ఈ సందర్బంగా మాట్లాడుతూ… బండి సంజయ్ కు సవాల్ విసిరారు. ఆధారాలతోనే కేసులు దర్యాప్తు చేస్తామని సీపీ రంగనాథ్ పేర్కొన్నారు. తాను సెటిల్మెంట్లు చేసినట్లు నిరూపించాలని సీపీ ఛాలెంజ్ విసిరారు. బండి సంజయ్ తో తనకు గట్టు పంచాయతీ లేదన్నారు. బండి సంజయ్ ఫోన్ పోలీసుల దగ్గర లేదని, తాను ఎలాంటి సెటిల్ మెంట్లు, దందాలు చేయని చెప్పారు సిపి. దర్యాప్తు ఏజెన్సీలను బెరించే ప్రయత్నం మంచిది కాదని సిపి రంగానాథ్ చెప్పారు.

మా ఉద్యోగ ధర్మం మమ్మల్ని చేయనివ్వండని కోరారు. సత్యం బాబు కేసు విషయంలో నాపై ఆరోపణలు చేశారు. సత్యంబాబు కేసు దర్యాప్తు అధికారిని నేను కాదని పేర్కొన్నారు. మేం ప్రమాణం చేసే ఉద్యోగంలోకి వస్తాం. ప్రతికేసులో ప్రమాణం చేయమంటే నేను 10 వేల సార్లు చేయాలన్నారు. మాల్ ప్రాక్టీస్ కేసును రాజకీయం చేయొద్దని సిపి కోరారు. పార్టీలకు అతీతంగా బాధితులకు న్యాయం చేస్తామని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News