Monday, December 23, 2024

వరంగల్ డిసిసిబి బ్యాంక్ రాష్ట్రంలో నెంబర్ వన్ కావాలి : మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్ : లాభాల బాటలో పయనిస్తూ అనేక అవార్డులను పొందుతున్న వరంగల్ డిసిసిబి బ్యాంక్ రాష్ట్రంలో నెంబర్ వన్ బ్యాంకుగా అభివృద్ధి చెందాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి , గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆకాంక్షించారు. వరంగల్ డిసిసిబి బ్యాంక్ డైరీ ఆవిష్కరణ చేశారు. డీసీసీబీ బ్యాంక్ డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ చేసుకున్న సందర్భంగా అందరికీ నూతన సంవత్సర , సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ బ్యాంక్ చైర్మన్ గా గతంలో పని చేసినందుకు ఈ బ్యాంక్ గురించి నాకు పూర్తి అవగాహన ఉందని అన్నారు.

ప్రజలకు, రైతులకు సేవ చేసేందుకు ఈ బ్యాంక్ మంచి అవకాశమని, అవినీతి ఆరోపణలున్న వారు డైరెక్టరు కోసం కొందరు వచ్చినా..నేను ఆమోదించలేదని తెలిపారు. పాలక వర్గం మంచిది కావాలని అనుకున్నాను, ఎమ్మెల్యేలు కూడా అలాంటి ప్రతిపాదనలే చేశారని, సేవా భావంతో పని చేయాలని, దీనితో రాజకీయ భవిష్యత్ ఉంటుందని అన్నారు. నేను అప్పట్లో జిల్లా పరిషత్ ప్రెసిడెంట్ కావాలి అనుకున్నాను, కానీ కుల సమీకరణల వల్ల డీసీసీబీ బ్యాంక్ చైర్మన్ గా ఇస్తున్నా అని నాటి సీఎం ఎన్టీఆర్ చెప్పారు.

బ్యాంక్ చైర్మన్ గా నేను సేవ చేశానని పేర్కొన్నారు. ఆంధ్రలో ఉన్న బ్యాంక్స్ రికవరీ చూసి బాధ పడేవాడినని, అక్కడ 80 శాతం రికవరీ ఉండేదని. మన దగ్గర ఒకటి, రెండు బ్యాంక్ లలోనే అలాంటి రికవరీ ఉండేదని, కానీ నేడు మన బ్యాంక్ వారి కంటే రికవరీలో చాలా ముందుందని ఆనందం వ్యక్తం చేశారు. బ్యాంక్ అభివృద్ది కోసం ఎక్కడా రాజీ పడకుండా పని చేసినందుకు మంత్రి వారిని అభినందించారు. బ్యాంక్ ను ఇంకా ముందుకు తీసుకెళ్లాలని, జెడ్పీటీసీ, ఎంపీటీసీలతో పోల్చుకుని మాకు సరైన గౌరవం లేదని బాధ పడాల్సిన అవసరం లేదని, మీకు సరైన గౌరవం కల్పించే కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.

చైర్మన్లకు గౌరవ వేతనం ఇస్తూ, గౌరవం ఇవ్వాలని నేను, మంత్రి నిరంజన్ రెడ్డి సిఎం కెసిఆర్ ని అడిగామని తెలిపారు. సిఎం కూడా ఒప్పుకున్నారని, ప్రోటోకాల్ కూడా ఇస్తా అని అన్నారని , మళ్ళీ సిఎం కెసిఆర్ దగ్గరికి వెళ్ళి ఏ విధమైన ప్రోటోకాల్ ఇస్తే బాగుంటుంది అని అడుగుతామనియ అన్నారు. బ్యాంక్ లో డిపాజిట్లు కూడా పెంచినందుకు అభినందనలు తెలియజేశారు.  బ్యాంక్ మీద నమ్మకం కుదిరితే డిపాజిట్లు వస్తాయని, బ్యాంక్ పై నమ్మకం ఇపుడిపుడే పెరుగుతుందని కాబట్టి డిపాజిట్లు వస్తాయని సూచించారు.

దళిత బంధు మొత్తం ఇందులో డిపాజిట్ చేసేలా కృషి చేస్తానని, బ్యాంక్ ద్వారా చాలా రకాల రుణాలు ఇస్తున్నందుకు అభినందించారు. చాలా కుటుంబాలకు లాభం చేస్తున్నారని, ఇలాగే బ్యాంక్ ను ఇంకా ముందుకు తీసుకెళ్లడంలో మా సహకారం ఉంటుందని వివరించారు. గతంలో మేము ఉన్నపుడు 40 శాతం రికవరీ కోసం రాత్రింబవళ్ళు కష్టపడే వాళ్ళమని, కానీ నేడు అవన్నీ మీరు అధిగమించారని అభిప్రాయ పడ్డారు. గతంలో బోర్ వేయడానికి రైతుకు రుణం ఇచ్చేది. మోటార్ల కోసం రుణం ఇచ్చేవారు. బోర్ పడక, మోటార్లు కాలి పోయి రుణం తిరిగి రాకపోయేదని, గతంలో రైతుల పరిస్తితి దారుణంగా ఉండేదని,.తద్వారా రుణాల చెల్లింపు ఉండక పోయేదని తెలిపారు.

కానీ సిఎం కెసిఆర్ నాయకత్వంలో కరెంట్ 24 గంటలు ఉంటుందని, బావుల్లో నీరు ఉన్నాయని, కాళేశ్వరం, దేవాదుల వల్ల నీరు నిండుగా ఉన్నాయని, రైతు బంధు ద్వారా పెట్టుబడి మొత్తం ఇస్తున్నారని సూచించారు. రాష్ట్రంలో మన బ్యాంక్ నంబర్ 1 రావాలని, గతంలో ఒక్క అవార్డు కూడా రాలేదని, ఇప్పుడు అవార్డులు వస్తున్నాయని తెలిపారు. కొత్త బ్రాంచీలు కోసం లాండ్ ఇవ్వడం మా బాధ్యత కచ్చితంగా ఇస్తామని తెలిపారు. రోడ్ కూడా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.

 

చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ నూతన పాలక వర్గాన్ని మనస్పూర్తిగా అభినందిస్తున్న అన్నారు. బ్యాంక్ సహకార స్ఫూర్తి గొప్పదని, అసంఘటిత కార్మికులను ఏకం చేసి 60 సంఘాలు చేశామని, వారికి రుణాలు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. గొప్ప చరిత్ర ఉన్న ఈ బ్యాంక్ నగర ప్రజలకు సహకారం అందించాలని తెలిపారు. ఎమ్మెల్యే అరూరి రమేష్ గారి మాట్లాడుతూ డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ శుభాకాంక్షలు తెలిపారు. లాభాల బాటతో పాటు అవార్డుల పంట పండిస్తున్న మీకు మా సహకారం తప్పకుండా ఉంటుందని చెప్పారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, రైతు రుణ విమోచనా కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకన్న, బ్యాంక్ డైరెక్టర్లు, రైతు సంఘాల నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News