Sunday, November 17, 2024

వరద బాధితులకు అండగా నిలుద్దాం: దాస్యం వినయ్ భాస్కర్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హన్మకొండ ప్రతినిధి: వరద బాధితులకు అండగా నిలుస్తామని చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పిలుపునిచ్చారు. ఆదివారం వరంగల్ పశ్చిమ నియోజకవర్గం 9వ డివిజన్‌లోని కాకతీయ కాలనీలో ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే, హన్మకొండ జిల్లా బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు దాసయ వినయ్‌భాస్కర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా ఒక సంవత్సర కాలంలో పడేంత వర్షం చారిత్రాత్మక నగరంలో ఒకే రోజులో పడటం కారణంగా పెద్ద ఎత్తున ప్రజలందరికీ ఇబ్బంది కలిగిందని దాస్యం వినయ్ భాస్కర్ పేర్కొన్నారు.

Also Read: నేను బర్రెనైతే… బండారు పంది: ఆర్‌జివి

సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు, స్థానిక ఎమ్మెల్యేలు, మున్సిపల్ అధికారులు, కమిషనర్, రెవెన్యూ, పోలీసు, ఫారెస్ట్ సిబ్బంది, ఇతర సంఘాల అధికారులందరూ మంత్రి కెటిఆర్ ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని సమీక్షించి ఎన్‌డిఆర్‌ఎఫ్, రెస్కూ టీమ్స్ కావలసినటువంటి సామగ్రిని అందించడం జరిగిందని వినయ్ భాస్కర్ వివరించారు. అధికారులు, ప్రజాప్రతినిధులతో పాటు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి పేదలందరికీ నిత్యావసర వస్తువులను అందించారు. గత కొన్నేళ్లుగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి 600 మందికి అమెజాన్ ఆధ్వర్యంలో బాల వికాస స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో శౌరిరెడ్డి నాయకత్వంలో మున్సిపల్ కమిషనర్ రిజ్వాన్ పాషా సమన్వయం చేస్తూ వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని లోతట్టు ప్రాంతాల్లో ఉన్న బాధితులకు రూ. 3000 విలువ గల దోమతెరలు, ఇంటి పైకప్పుల కోసం టార్పాలిన్ కవరు, బకెట్, బ్రష్‌లు, నిత్యావసర వస్తువులు అందించడం జరిగిందన్నారు. వరదల వల్ల ఇళ్లు పాడైనట్లయితే గృహలక్ష్మి కింద దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రిజ్వాన్ భాషా, స్థానిక కార్పోరేటర్ చీకటి శారద ఆనంద్, స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News