- Advertisement -
గీసుకొండ: వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని లక్నపల్లి-రామారం గ్రామాల మధ్య ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వడ్ల లోడ్ తో వెళ్తున్న లారీ కారుపై బోల్తాపడడంతో ఒకరు మృతి చెందగా మరికొందరు గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఓవర్ లోడ్ తో పాటు అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జుగా మారింది.
- Advertisement -