Monday, November 25, 2024

రాష్ట్రంలో మరో నగరానికి అరుదైన గుర్తింపు

- Advertisement -
- Advertisement -

Warangal is recognized by UNESCO

యునెస్కో గ్లోబల్ నెట్‌వర్క్ ఆఫ్ లెర్నింగ్ సిటీస్‌లో వరంగల్‌కు చోటు
హర్షం వ్యక్తం చేసిన కేంద్ర, రాష్ట్ర మంత్రులు

హైదరాబాద్: వరంగల్ నగరానికి మరో అరుదైన గుర్తింపు లభించింది. ఏడాది వ్యవధిలోనే తెలంగాణలోని వరంగల్‌కు యునెస్కో నుంచి మరో గుర్తింపు లభించడం విశేషం. ఐక్యరాజ్యసమితి విద్య, శాస్త్ర, సాంస్కృతిక సంస్థ (యునెస్కో) గుర్తించిన అభ్యాసన నగరాల ప్రపంచ నెట్‌వర్క్‌లో వరంగల్‌కు చోటు దక్కించుకుంది. ఇప్పటికే వరంగల్‌లోని ప్రఖ్యాత రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కో గుర్తించిన నేపథ్యంలో యునెస్కో గ్లోబల్ నెట్‌వర్క్ ఆఫ్ లెర్నింగ్ సిటీస్‌లో వరంగల్‌కు చోటు దక్కడంపై కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హర్షం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News