- Advertisement -
దంతేవాడ: ఛత్తీస్‌గఢ్‌లో గత కొన్ని రోజులుగా భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య కాల్పులు జరుగుతున్నాయి. తాజాగా మరోసారి ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్ జరిగింది. దంతేవాడ, బీజాపూర్ జిల్లాల సరిహద్దులోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం అందుకున్న భద్రతా సిబ్బంది యాంటీ-నక్సలైట్ ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో నక్సలైట్లు కాల్పులకు తెగబడ్డారు.
ఈ ఎన్‌కౌంటర్‌లో మహిళా మావోయిస్టు మృతి చెందింది. మృతి చెందిన మావోయిస్టు వరంగల్‌కు చెందిన రేణుక అలియాస్ ఛైతి అలియాస్ సరస్వతిగా గుర్తించారు. ఈమె మావోయిస్టు స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలని.. దండకారణ్య స్పెషల్ జోన్‌లో కమిటీ సభ్యురాలిగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆమె తలపై రూ.25లక్షలు ఉన్నట్లు వెల్లడించారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో భారీగా తుపాకులు, పేలుడు పదార్థాలు, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
- Advertisement -