Monday, January 20, 2025

కాంగ్రెస్‌లో చేరిన వరంగల్ మేయర్ గుండు సుధారాణి

- Advertisement -
- Advertisement -

బిఆర్‌ఎస్ పార్టీకి సొంత పార్టీ నేతలు వరుసగా షాకులిస్తున్నారు. ఇప్పటికే సిట్టింగ్ ఎంపిలు, ఎమ్మెల్యేలు సైతం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి వరంగల్ జిల్లాలో బిఆర్‌ఎస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. వరంగల్ మేయర్ గుండు సుధారాణి గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ మేరకు ఆమెకు పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి సాదారంగా ఆహ్వానించారు. ఈ క్రమంలోనే ఆ పార్టీలోని కీలక నేత, మేయర్ గుండు సుధారాణి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో పరిణామాలు పూర్తిగా మారిపోయాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News