Wednesday, January 22, 2025

ప్రీతికి సరైన వైద్యం అందడం లేదు: తండ్రి నరేంద్ర

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వైద్య విద్యార్థిని ప్రీతి ఆరోగ్యం విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రీతికి సరైన వైద్యం అందడం లేదని ఆమె తండ్రి నరేంద్ర ఆరోపిస్తున్నారు. ఎంజీఎంలోనే సరైన వైద్యం అందినట్లు కనిపిస్తోందని తెలిపారు. నిన్నటి నుంచి తన కుమారై గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంజీఎం ఆస్పత్రి పరువు పోతుందని ప్రీతిని హైదరాబాద్ తరలించారని నరేంద్ర తెలిపారు. ప్రీతి వేధింపులపై పోలీసులకు పలుమార్లు చెప్పినా స్పందించలేదన్నారు. తన బిడ్డ పరిస్థితి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వరంగల్ కాకతీయ వైద్య కళాశాలలో ప్రీతి ఆత్మహత్యయత్నం చేసిన సంఘటన తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News