Wednesday, January 22, 2025

కాంగ్రెస్ లోకి మరో బీఆర్ఎస్ ఎంపి జంప్?

- Advertisement -
- Advertisement -

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పలువురు బిఆర్ఎస్ నాయకులు ముఖ్యమంత్రిని కలవడంపై రకరకాల ఊహాగానాలు వెలువడుతున్నాయి. బిఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ శుక్రవారం ఉదయం సిఎం రేవంత్ ను ఆయన నివాసంలో కలసివచ్చారు. ఇది జరిగి కొన్ని గంటలైనా కాకముందే ఆ పార్టీకి చెందిన వరంగల్ ఎంపీ పసునూరు దయాకర్ సచివాలయంలో సిఎంతో భేటీ అయ్యారు.

బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ వరంగల్ ఎంపీ టికెట్ ను కడియం కావ్యకు ఇవ్వడంతో దయాకర్ మనస్తాపం చెందారు. పార్టీ అధిష్ఠానానికి విధేయంగా ఉన్నప్పటికీ తనకు టికెట్ ఇవ్వకపోవడంపై నొచ్చుకున్న దయాకర్ కాంగ్రెస్ లో చేరేందుకు నిర్ణయించుకున్నట్లు తెలిసింది. అందులోభాగంగానే ఆయన రేవంత్ ను కలిసినట్లు సమాచారం. దయాకర్ 2015 వరంగల్ ఉపఎన్నికలోనూ, 2019 ఎన్నికల్లోనూ గెలిచారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News