Tuesday, January 21, 2025

భర్త వేధింపులు…. ఉరేసుకున్న ప్రభుత్వ ఉద్యోగిని

- Advertisement -
- Advertisement -

వరంగల్: వరకట్నం తీసుకరావాలని ప్రభుత్వ ఉద్యోగినిని భర్త వేధించడంతో ఆమె ఆత్మహత్య చేసుకున్న సంఘటన వరంగల్ జిల్లా కేంద్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రాకరం… ములుగు జిల్లాలోని మంగపేట మండలానికి చెందిన రామనర్సయ్య(45), ఏటూరునాగారానికి చెందిన సఫియా(38)ను 2004లో పెళ్లి చేసుకున్నాడు. సఫియా, రాంనర్సయ్య ఇద్దరూ వ్యవసాయ శాఖలో విధులు నిర్వహిస్తున్నారు. ఈ దంపతులకు 16 ఏళ్ల కూతురు ఉంది. భర్త మద్యానికి బానిస కావడంతో దంపతుల మధ్య గత కొన్ని రోజుల నుంచి గొడవలు జరగడంతో పెద్ద మనుషులు వారికి సర్ది చెప్పారు. శనివారం సాయంత్రం ఆరు గంటలకు భర్తతో భార్యకు గొడవ జరిగింది. ఘర్షణ తారాస్థాయికి చేరుకోవడంతో పడక గదిలోకి వెళ్లి భార్య డోర్ వేసుకుంది. అనంతరం చున్నీతో ఉరేసుకుంది. కూతురు, తండ్రి కలిసి డోర్ బద్దలుకొట్టి చూడగా భార్య ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. వెంటనే కిందకు దించి ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె చనిపోయిందని పరీక్షించిన వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని శవపరీక్ష కోసం ఎంజిఎం ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News