వరంగల్ ఒఆర్‌ఆర్
భూసేకరణకు స్వస్తి
చెప్పడానికి రాష్ట్ర ప్రభుత్వం
నిర్ణయం
మనతెలంగాణ/హైదరాబాద్ : వరంగల్ నగరం చుట్టూ నిర్మించతలపెట్టిన ఔటర్ రింగ్ రోడ్టు (ఓఆర్‌ఆర్)కోసం చేపట్టిన ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను రుద్దుచేస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఏప్రిల్ 30న కాకతీయ ఆర్బన డెవలప్‌మెంట్ అథారిటీ జారీ చేసిన నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రభుత్వం సోమవారం నాడు ప్రకటించింది. పురపాలక శాఖ స్పెషల్ సీఎస్ అరవింద్ కుమార్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్ నగరం చుట్టూ 41కి.మి పోడవైన రింగ్ రోడ్డును నిర్మించటానికి ల్యాండ పూలింగ్ పద్దతిలో భూమిని సేకరించాలని ముందుగా కుడా నిర్ణయించింది. ఈ మేరకు ఓఆర్‌ఆర్ విస్తరించిన 28గ్రామాల్లో సర్వే పనులు కూడా జరిపారు. దీంతో స్థానిక రైతులనుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత రావటం , రైతులు ఉద్యమించడంతో ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది.