- Advertisement -
వరంగల్: భద్రకాళి చెరువుకు గండి పడిందని నగర ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆ గండిని ఆపే చర్యలు తీసుకుంటున్నామని వరంగల్ మేయర్ గుండు సుధారాణి వెల్లడించారు. మునిసిపల్ మంత్రి కెటిఆర్ కూడా పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పర్యవేక్షిస్తున్నారని ఆమె తెలిపారు. వరద ఉద్ధృతికి పోతననగర్ వైపు భద్రకాళి చెరువుకు గండిపడింది. దీంతో ముంపు ప్రాంత ప్రజలు వెంటనే ఇళ్లను ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించారు.
వరంగల్ జిల్లాలో వారం రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో భద్రకాళి చెరువుకు వరద పోటెత్తింది. వరద ఎక్కువగా కావడంతో భద్రకాళి చెరువు పొంగిపొర్లుతోంది. భద్రకాళి చెరువు ఒకసారి గండిపడడంతో పోతన నగర్, సరస్వతి నగర్ కు ప్రమాదం పొంచి ఉంది. దీంతో ఆయా కాలనీలో నివాసిస్తున్న ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు.
- Advertisement -