Sunday, January 19, 2025

అత్యంత విషమంగా ప్రీతి పరిస్థితి.. ఇది ముమ్మాటికీ హత్యే: ప్రీతి తండ్రి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రీతి బ్రెయిన్ డెడ్ అయిందని డాక్టర్లు చెబుతున్నారని ఆమె తండ్రి పేర్కొన్నారు. ఇటీవల వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో మెడికో ప్రీతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ముచ్చట తెలిసిందే. ఆమె ప్రస్తుతం హైదరాబాద్ నిమ్స్ లో చికిత్స పొందుతుండగా, ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా మారిందని డాక్టర్లు వెల్లడించారు. ప్రీతి తండ్రి మీడియాతో మాట్లాడుతూ…. వైద్యులు కష్టమేనని అంటున్నారని విచారం వ్యక్తం చేశారు. ప్రీతి బ్రెయిన్ డెడ్ అయిందని నిమ్స్ వైద్యులు చెబుతున్నారని ఆయన తెలిపారు.

చికిత్స కొనసాగుతోందని వారు చెబుతున్నా, తమకు సందేహంగానే ఉందని ఆరోపించారు. నిన్నటి వరకు కొంత ఆశ ఉండేదని, ఇప్పుడది కూడా పోయిందన్నారు. అయితే కాసేపట్లో ప్రీతి ఆరోగ్య పరిస్థితిపై నిమ్స్ వైద్యులు కీలక ప్రకటన విడుదల చేయనున్నారు. నిమ్స్ వద్ద భద్రతను పెంచారు. గత ఐదు రోజులుగా వైద్యులు ప్రీతికి చికిత్స అందిస్తున్నారు. ప్రీతిని సైఫే హత్య చేశాడని ప్రీతి తండ్రి ఆరోపిస్తున్నాడు. ప్రీతి జోకికిరాకుండా సైఫ్ ను నియంత్రించలేకపోయారన్నారు. ఈ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.నిమ్స్ ఆస్పత్రి ఆవరణలో ప్రీతి బంధువుల ఆందోళనకు దిగారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News