Monday, January 20, 2025

పాదయాత్రలో విద్వేషపూరిత ప్రకటనలు చేస్తున్నారు: పోలీసులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రజా సంగ్రామ యాత్రను నిలిపేయండని వరంగల్ పోలీసులు బిజెపికి నోటీసులు జారీ చేశారు. పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్ లకు వర్దన్నపేట ఏసీపీ నోటీసులు జారీ చేశారు. “జనగామ జిల్లాలో ప్రజా సంగ్రామ యాత్రకు అనుమతి లేదు. పాదయాత్ర పేరిట విద్వేషపూరిత ప్రకటనలు చేస్తున్నారు. ధర్మదీక్ష పేరుతో వివిధ జిల్లాల నుండి భారీ ఎత్తున జన సమీకరణ చేస్తున్నారు. రెచ్చగొట్టే ప్రకటనలతో, ఇతర జిల్లాల నుండి కార్యకర్తలను రప్పిస్తుండటంతో జిల్లాలో శాంతిభద్రతల విఘాతం ఏర్పడే ప్రమాదం ఉంది. తక్షణమే ప్రజా సంగ్రామ యాత్రను నిలిపేయాలి. నోటీసును పరిగణలోకి తీసుకోకుండా తిరిగి ప్రజా సంగ్రామ యాత్రను ప్రారంభిస్తే శాంతిభద్రతల సమస్య కింద చట్టపరమైన చర్యలు తీసుకుంటాం” పోలీసులు నోటీసులో పేర్కొన్నారు.

Warangal Police Issues Notice to BJP over Padayatra

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News