Thursday, January 23, 2025

రెండో పెళ్లి… పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న భార్య… భర్తే తగలబెట్టాడని ఆరోపణలు

- Advertisement -
- Advertisement -

వరంగల్: ఓ వివాహిత పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకోవడంతో 90 శాతం కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న సంఘటన వరంగల్ జిల్లాలో జరిగింది. మరో వైపు ఆమె తల్లిదండ్రులు భర్తే పెట్రోల్ పోసి నిప్పంటించాడని ఆరోపణలు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. వరంగల్ జిల్లాకు చెందిన ఎండి ఆస్మ(25) మొదటి భర్తతో గొడవలు రావడంతో విడిపోయింది. విడిపోయిన సమయంలో ఎండి మజార్ పరిచయం కావడంతో ఇద్దరు ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఎండి మజార్‌కు అప్పటికే పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎండి మజార్ చెప్పుల దుకాణం నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. శ్రీ సత్యసాయినగర్‌లో ఇల్లు అద్దెకు తీసుకొని తన రెండో భార ఆస్మతో కలిసి ఉంటున్నాడు. గత కొన్ని రోజులుగా వీరి మధ్య గొడవలు జరుగుతుండడంతో మనస్తాపానికి గురై ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆస్మ నిప్పంటించుకుంది. ఆమెను కాపాడే క్రమంలో భర్త మజార్ చేతికి గాయాలయ్యాయి. వెంటనే ఆమెను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఆమె కొన ఊపిరితో ఎంజిఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పెట్రోల్ బంకు నుంచి పెట్రోల్ తీసుకొని తన కూతురుపై అల్లుడు పోసి నిప్పంటించాడని ఆమె బంధువులు ఆరోపణలు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News