Monday, December 23, 2024

నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన వరంగల్ యువకుడు

- Advertisement -
- Advertisement -

ప్రస్తుతం ఉన్న పోటీని ఎదుర్కొని ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటేనే నానా తంటాలు పడుతున్న క్రమంలో వరంగల్ జిల్లాకు చెందిన యువకుడు ఒకేసారి నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి అందరి నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు.
నెక్కొండ మండలంలోని సూరిపల్లి గ్రామానికి చెందిన రంజిత్.. ఇంజినీరింగ్ పూర్తి చేసి ప్రభుత్వం ఉద్యోగం సంపాదించాలనే లక్ష్యంతో ప్రిపరేషన్ ప్రారంభించాడు. ఎంతో కష్టపడి చదివిన రంజిత్.. మొదట, రైల్వేలో టెక్నీషియన్ ఉద్యోగం సాదించాడు. తర్వాత గతేడాది చివరలో వెల్లడించిన పోలీస్ కొలువుల ఫలితాల్లో ఎక్సైజ్ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగానికి.. ఫిబ్రవరి 9న ప్రకటించిన గ్రూప్ 4లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు.

ఈ మూడు ఉద్యోగాలతోపాటు శనివారం ప్రకటించిన టైన్ ప్లానింగ్ అధికారి పరీక్ష ఫలితాల్లో కూడా ఉద్యోగానికి ఎంపికయ్యాడు. దీంతో సంవత్సరం కాలంలోపే నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించిన రంజిత్ ను గ్రామస్తులతోపాటు పలువురు అభినందిస్తున్నారు. కాగా ఈ నాలుగింట్లో రంజిత్.. టౌన్ ప్లానింగ్ అధికారి ఉద్యోగంలో చేరనున్నట్లు తెలిపాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News