Monday, December 23, 2024

వార్డు పరిపాలన వ్యవస్థతో మరింత మెరుగైన పౌర సేవలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రజలకు మరింత మెరుగైన పారదర్శకతతో కూడిన పరిపాలన అందించేందుకు గ్రేటర్ వ్యాప్తంగా వార్డు వ్యవస్థను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు జిహెచ్‌ఎంసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు. జూన్ 2 నుంచి అమలు కానున్న వార్డు పరిపాలన వ్యవస్థకు సంబంధించిన అధికారుల శిక్షణ కార్యక్రమాన్ని గురువారం జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయంలో జిహెచ్‌ఎంసి కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్, జనమండలి ఎండీ దానకిషోర్ లతో కలిసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మిప్రారంభించారు.

ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు విజన్‌ను అనుసరించి 50 వేల జనాభాకు ఒక వార్డును ఏర్పాటు చేస్తున్నామన్నారు. వార్డు పరిపాలన వ్యవస్థలో భాగంగా ప్రతి వార్డు కార్యాలయాల్లో వివిధ విభాగాలకు చెందిన 10 మందితో కూడిన అధికారుల బృందం సేవలందించనున్నారని తెలిపారు. వార్డుల వారిగా ప్రజల నుండి అందిన ఫిర్యాదులను సంబంధిత అధికారులు సత్వరమే పరిష్కరించడంతో పాటు ఇందుకు సంబంధించిన సమాచారాన్ని ఫిర్యాదు దారుడికి అందించడమే లక్ష్యంగా వార్డు వ్యవస్థ పని చేస్తుందని తెలిపారు.

వార్డు స్థాయిలో త్రాగునీరు, సీవరేజ్, శానిటేషన్, టౌన్ ప్లానింగ్ తదితర సమస్యలపైసంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించిసిటీజన్ చార్ట్ ఆధారంగా నిర్ణీత సమయంలో సమస్య పరిష్కారానికి కృషి చేస్తారని తెలిపారు. అధికారులు ప్రజా సమస్యలను సావధానంగా వినడమే కాకుండా సానుకూల దృక్పథం, పారదర్శకత, జవాబుదారీతనంతో వాటిని పరిష్కరించడం ద్వారా ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చాలని సూచించారు. వార్డు లెవల్ అధికారులు కార్పొరేటర్లకు, ప్రజాప్రతినిధులకు అందుబాటులో ఉండాలన్నారు. ఈ సందర్భంగా మేయర్ వార్డు పరిపాలన సంబంధించిన నియమావళి పుస్తకాన్ని ఆవిష్కరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News