తార్నాక: ప్రజల సమస్యలు త్వరగా పరిష్కరించేందుకు వార్డు కార్యాలయాలు ఎంతో దోహదపడతాయని డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతశోభన్‌రెడ్డి పేర్కోన్నారు. ఈ మేరకు సోమవారం తార్నాక వార్డు కార్యాలయాన్ని బిఆర్‌ఎస్ కార్మిక విబాగం అద్యక్షుడు మోతే శోభన్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హైద్రాబాద్ నగర ప్రజల సమస్యల తక్షణ పరిష్కారం కోసం మంత్రి కెటిఆర్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి ఒక్కరు స్వాగతిస్తున్నారని తెలిపారు.
నగర వ్యాప్తంగా 150 డివిజన్లో ఏర్పాటు చేసిన వార్డు కార్యాలయాలు ప్రజలకు మరింత చెరువుగా పరిపాలన ఉంటుందని అన్నారు.అన్ని విభాగాల అదికారులు ఒకే చోట అందుబాటులో ఉండే వార్డు కార్యాలయాల్లో ప్రజల ఫిర్యాదులు స్వీకరించడంతో పాటు పరిష్కారం లభిస్తుందని అన్నారు.వార్డు కార్యలయాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిహెచ్‌ఎంసి ఏఎంసి హేమలత, టౌన్‌ప్లానింగ్ ఎసిపి ముంతాజ్ బేగం, జలమండలి డిజిఎం సరిత, శానిటేషన్ సూపర్‌వైజన్ ధనాగౌడ్, ఎంటమాలజీ రాజశేఖర్, ఇతర అధికార సిబ్బంది, బిఆర్‌ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.