Friday, December 20, 2024

గ్రేటర్‌లో కన్నుల పండువగా వార్డు కార్యాలయాల ప్రారంభోత్సవం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గ్రేటర్‌లోవార్డు కార్యాలయాల ప్రారంభోత్సవాలు కన్నుల పండువగా జరిగాయి. పరిపాలన వికేంద్రీకరణ ద్వారా సుపరిపాలనే లక్షంగా దేశంలోనే ప్రప్రథమంగా అందుబాటులోకి తీసకువచ్చిన వార్డు పరిపాలన వ్యవస్థకు శుక్రవారం నాంది పలికారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ ఉత్సవ దశాబ్ది వేడుకల సందర్భంగా పట్టణ ప్రగతి దినోత్సం పురస్కరించుకుని గ్రేటర్‌లోని 150 వార్డు కార్యాలయాలకు గాను ఒకే రోజు 132 వార్డు కార్యాలయాలను ప్రారంభించి రికార్డు సృష్టించారు. మిగిలిన 18 వార్డు కార్యాలయాలు మరో వారం రోజుల్లో అందుబాటులోకి రానున్నాయి. వార్డు కార్యాలయాల ప్రారంభోత్సవంలో భాగంగా కాచిగూడ వార్డు కార్యాలయాన్ని పురపాలక మంత్రి తారక రామారావు లాంఛనంగా ప్రారంభించారు.

అదేవిధంగా హోంశాఖ మంత్రి మహమూద్‌అలీ అజాంపుర వార్డు కార్యాలయాన్ని ప్రారంభించగా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంత కుమారి బల్కంపేట్ డివిజన్ వార్డు కార్యాలయాన్ని ప్రారంభించారు. బంజరాహిల్స్ వార్డు కార్యాలయంతో హిమాయత్ నగర్ వార్డు కార్యాలయాన్ని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్ గడ్డం మహాలక్ష్మితో కలిసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రారంభించారు. అదేవిధంగా లింగోజిగూడ వార్డు కార్యాలయాన్ని కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి, రామంతపూర్ వార్డు కార్యాలయాన్ని కార్పొరేటర్ శ్రీవాణితో కలిసి మేయర్ విజయలక్ష్మి ప్రారంభించారు. గ్రేటర్‌లోని వివిధవార్డు కార్యాలయాలను మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పోరేటర్లలతో కలిసి ఎక్కడికక్కడ ప్రారంభించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News