Friday, January 3, 2025

వార్డు కార్యాలయాలను జోనల్ కమిషనర్లు పరిశీలించాలి

- Advertisement -
- Advertisement -

సిటీబ్యూరో : ఇటీవల ప్రారంభించిన వార్డు కార్యాలయాలను క్రమం తప్పకుండా త నిఖీలు నిర్వహించడం ద్వారా అందిన ఫిర్యాదుల ను సత్వరమే పరిష్కరించేలా చూడాలని జోనల్ క మిషనర్లను మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆదేశించారు. పౌరులకు మరింత పారదర్శకమైన సేవలను అందించడమే లక్షంగా ఇందుకు వారి నుంచి అందిన ఫిర్యాదులను వెం టనే పరిష్కరించేలా పరిపాలనను పౌరుల గుమ్మం వద్దకు తీసుకురావడం పురపాలక శాఖ మంత్రి కె. తారక రామారావు ఆశయమని ఆమె అన్నారు. వార్డు కార్యాలయాల్లో అధికారులు , సిబ్బంది ప్రజల నుంచి ఫిర్యాదులను మర్యాదపూర్వకంగా స్వీకరించడం, వారి సమస్యలను పరిష్కరించడంలో చురుకుగా ఉండాలన్నారు.

ప్రజలు నేరు గాని, ఆన్‌లైన్‌తో పాటు మై జిహెచ్‌ఎంసి యాప్ ఏరూపంలో ఫిర్యాదు ఇచ్చినా వాటిని అధికారులు తీసుకోవాలన్నారు. ఇందుకు సంబంధించి అవగాహన కల్పించడానికి, వార్డ్ అధికారి ఆర్‌డబ్లూఎ అధికారులను సంప్రదించాలని సూచించారు. ప్రతి డివిజన్‌లో వార్డు కార్యాలయం ప్రారంభించారని, ప్రజలు తమ ఫిర్యాదులను ఇక్కడ అందజేయవచ్చాని కార్పొరేటర్లు కూడా నగరవాసులందరికీ అవగాహన కల్పించడంతో పాటు వారు తమ ఫిర్యాదులను వార్డు కార్యాలయంలో ఇచ్చేలా ప్రోత్సహించాలని మేయర్ సూచించారు.

వార్డు అధికారులు త మ పరిధిలో లేని ఫిర్యాదులను పరిష్కరించేందుకు ఉన్నతాధికారులకు బ దిలీ చేయడంతో పాటు ఫిర్యాదులు నిర్దిష్ట వార్డుకు చెందినవి కాకపోతే సం బంధిత వార్డుకు బదిలీ చేయాలన్నారు. సమస్య పరిష్కారం పట్ల ఫిర్యాదుదార్లు సంతృప్తి చెందిరా లేదా అని ఫోన్ ద్వారా అడిగి తెలుసుకోవాలన్నా రు. కార్యాలయ సమయంలో వార్డు అధికారి వార్డు కార్యాలయంలో అధికారులు నిర్దేశించిన సమయ పాలనను ఖచ్చితంగా పాటించాలని , కార్యాలయ పనివేళల్లో ఇతర సిబ్బంది ఉండేలా చూడాలని మేయర్ అధికారుల ను కోరారు. ఆకస్మిక తనిఖీల ద్వారా వార్డు కార్యాలయాల పనితీరును పరిశీలించనున్నట్లు మేయర్ వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News