హస్తినాపురం: జిహెచ్‌ఎంసి పరిధిలోని పలు డివిజన్లలో కాలనీల సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా జిహెచ్‌ఎంసి పరిధిలో ప్రతి డివిజన్‌కు ఒక వార్డు కార్యాలయాన్ని ఏర్పాటు చేసిందని ఎల్‌బినగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తెలిపారు. సమస్య ఏర్పడ్డ వెంటనే దగ్గరలోని వార్డు కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న అధికారులు చేరుకొని పరిష్కరించాలన్న లక్షంతో ఈ వార్డు కార్యాయాలు ప్రారంభించామన్నారు. చం పాపేటలో ఏర్పాటు చేసిన17వ నూతన వార్డు కా ర్యాలయాన్ని తెలంగాణ విజయోత్సవాల్లో భాగంగా పట్టణ ప్రగతిలో భాగంగా శుక్రవారం జిహెచ్‌ఎంసి అధికారులు ప్రారంభోత్సవ వేడుక నిర్వహించారు.
జోనల్ కమీషనర్ పంకజ ఆధ్వర్యాన జరిగిన వేడుకకు ముఖ్యఅతిథిగా స్తానిక ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి శుభారంగా చేశారు. 11 శాఖల అధికారులకు భాధ్యతలు అప్పగించి విధి నిర్వహణలకు పారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇక నుండి ప్రతి చిన్న విషయానికి చిన్న సమస్య పరిష్కారానికి దూరాన ఉన్న మున్సిపల్ ఆఫీసుకు వెళ్లకుండా దగ్గరలో గల వార్డు కార్యాలయం అధికారుల దృష్టికి తీసుకపోతే వెంటనే సమస్య పరిష్కారం అవుతుందని చెప్పారు. వార్డు కార్యాలయం అడ్మినిష్ర్టేటివ్ అధికారి తులసి శ్రీనివాస్‌కు భాద్యతలు అప్పగించారు.
కార్యక్రమంలో డిసి సురేందర్‌రెడ్డి, అధికారులు అధికారులు కోటేశ్వర్‌రావు, వెంకటేశ్, బా లరామరాజు, వార్డు ఇంజనీర్ సురేశ్, వార్డు టౌన్ ప్లానర్ మధుసూధన్‌రెడ్డి, ఎంటమాలజిస్ట్ పెం టయ్య, సానిటర్ జవాన్ కె.నర్సింహ్మ, కమ్యూనిటి ఆర్గనైజర్ పి.నర్సింగ్‌రావు, యుబిడి సూపర్‌వైజర్ బోడ ఆనంద్, హెచ్‌ఎండబ్లుఎస్ ఎస్‌బి వార్డు అసిస్టెంట్ షేక్ నయీం, విద్యుత్తు ఆపరేటర్ రమేశ్‌రెడ్డి పారిశుధ్య కార్మీకులు విధి నిర్వహణలు ప్రారంభించారు. బిఆర్‌ఎస్ నాయకులు నల్ల రఘుమారెడ్డి, గజ్జెల మధుసూధన్‌రెడ్డి, కృష్ణమాచారి, ఓరుగంటి వెంకటేశ్‌గౌడ్, వెంకట్‌రెడ్డి, రోజారెడ్డి, దనలక్ష్మి, టంగుటూరి నాగరాజు తదితరులు పాల్గొన్నారుపాల్గొన్నారు.