Sunday, December 22, 2024

వార్డు అధికారులు స్థానికంగా ఉంటూ అప్రమత్తంగా ఉండాలి

- Advertisement -
- Advertisement -

నల్గొండ:నల్గొండ పట్టణంలో గత వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పట్టణ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వార్డ్ అధికారులు స్థానికంగా ఉంటూనే అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ కమిషనర్ డా.కె.వి.రమణాచారి సూచించారు. గురువారం మున్సిపల్ సమావేశ మందిరంలో వార్డుధికారులు మెప్మా ఆర్పీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సందర్భంగా మాట్లాడుతూ వార్డు అధికారులు మెప్మా సిబ్బంది స్థానికంగా ఉంటూ వారి పరిధిలో వర్షాలు వరదల వల్ల కలిగే ఇబ్బందులను ఎప్పటికప్పుడు గుర్తించి సమాచారం ఇవ్వాలని సూచించారు.

అదేవిధంగా లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు వచ్చిన శిథిలావస్థలో ఉన్న భవనాలు ప్రమాదకరంగా ఉన్న వెంటనే టౌన్ ప్లానింగ్ అధికారులకు సమాచారం అందించి ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు. మరో రెండు రోజులపాటు కూడా వర్షాలు ఉన్న నేపథ్యంలో సిబ్బంది అప్రమత్తంగా ఉండి ఏమైనా సమస్య వస్తే మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కం ట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్లకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

పట్టణ మహిళలకు ప్రతి ఆదివారం 10గంటల 10 నిమిషాలకు అనే కా ర్యక్రమం పై విస్తృతంగా అవగాహన కల్పించి ప్రతి మహిళ ను భాగస్వా మ్యం చేయాలని సూచించారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించి చుట్టుపక్కల ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకునేలా చైతన్యం చేయాలన్నారు. చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయడం వల్ల డ్రైనేజీల్లో స్తంభించి మురికి నీరు రోడ్డుపైకి వచ్చి ప్రజల అనారోగ్యాల బారిన పడే ప్రమాణం ఉన్నందున వీధులకు వచ్చిన ట్రాక్టర్లకు చెత్తనందించాలని సూచించారు.

తెలంగాణకు హరితహారంలో భాగంగా ఇంటింటికి చెట్ల పంపిణీ కార్యక్రమంలో పట్టణంలో ప్రతిరోజు 8 వార్డులో చొప్పున స్థానిక కౌన్సిలర్ ఆధ్వర్యంలో మొక్కల పంపిణీ కార్యక్రమం జరుగుతున్నందున ప్రతి మహిళను ఆ చెట్ల నాటి వాటిని సంరక్షించుకునేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ సమావేశంలో ఏఎంసీ సయ్యద్ ముసబ్ అహ్మద్ టౌన్ ప్లానింగ్ అధికారి నాగిరెడ్డి డిఈ వెంకన్న ఏఈ రవీందర్ శానిటరి ఇన్స్పెక్టర్ నాగరాజు తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News