Monday, December 23, 2024

సమస్యల విసృత్త పరిష్కారానికి వార్డు వ్యవస్థ : దాన కిశోర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రజా సమస్యలను విస్తృతంగా పరిష్కరించడానికి వార్డు వ్యవస్థను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు జలమండలి ఎండీ దానకిషోర్ మాట్లాడుతూ తెలిపారు. జూన్ 2 నుంచి అమలు కానున్న వార్డు పరిపాలన వ్యవస్థకు సంబంధించిన అధికారుల శిక్షణ కార్యక్రమాన్ని గురువారం జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయంలో ప్రారంభించారు. ప్రతిరోజు సోషల్ మీడియా, వాట్సప్, హెల్ప్ లైన్, ఆఫ్ లైన్ ద్వారా అందుతున్న ఫిర్యాదులను క్షేత్రస్థాయిలోనే ఎప్పటికప్పుడు పరిష్కరిస్తారన్నారు. జలమండలి నగరానికి వందేళ్లకు సరిపడాతాగునీటి వసతి, వందశాతం సీవరేజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్ ను ఏర్పాటు చేసుకుందని చెప్పారు.

జలమండలిలో 48 రకాల గ్రీవెన్స్ పై హెల్ప్ లైన్ ద్వారా 30 మంది పర్యవేక్షిస్తున్నారని వెల్లడించారు. ఇందులో సిల్ట్‌కార్ట్, లో వాటర్, పొల్యూట్ వాటర్ పై లైన్ మెన్ టెస్టింగ్ లను నిర్వహిస్తారన్నారు. త్రాగునీరు లీకేజీ కాకుండా టెక్నాలజి ద్వారా గుర్తించి, రివర్స్ వాటర్ సప్లై కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ ప్రియాంక అలా, ఇ.ఎన్.సి జియా ఉద్దీన్, ఇవిడిఎం డైరెక్టర్ ప్రకాశ్‌రెడ్డి, సిసిపి దేవేందర్ రెడ్డి, అడిషనల్ కమిషనర్‌లు వి.కృష్ణ, జయరాజ్ కెన్నెడీ సరోజ,జోనల్ కమిషనర్లు వి.మమత, రవి కిరణ్, పంకజ, శంకరయ్య,శ్రీనివాస్ రెడ్డి, అశోక్ సామ్రాట్, అస్కి ప్రొఫెసర్ స్నేహలత , ప్రాజెక్టు ఆఫీసర్ సౌజన్య,డిప్యూటీ కమిషనర్లు, వార్డు పరిపాల అధికారులు, జలమండలి, విద్యుత్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News