Friday, December 20, 2024

విద్యార్థినిలను భర్తతో బయటకు పంపిన వార్డెన్… బాలికలపై లైంగిక దాడి

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లాలో దారుణం వెలుగులోకి వచ్చింది. హాస్టల్ విద్యార్థినులు కాపాడాల్సిన వార్డెన వారి పాలిట శాపంగా మారింది. విద్యార్థినులను తన భర్తతో బయటకు పంపించి బాలికపై అతడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. వార్డెన్ ఫణిశ్రీ భర్త శశికుమార్ విద్యార్థులకు మాయమాటలు చెప్పి బయటకు తీసుకెళ్లేవాడు. అనంతరం విద్యార్థినిలను బాపట్లలోని శివారులోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. బాలికలు తన తల్లిదండ్రులకు చెప్పడంతో ఆ విషయం వెలుగులోకి వచ్చింది. వార్డెన్ విద్యార్థినులపై ఒత్తిడి చేయడంతో శశికుమార్‌తో కలిసి బయటకు వెళ్లినట్టు ప్రాథమిక విచారణలో తేలింది. శశికుమార్‌పై టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News