Saturday, December 21, 2024

సాయిచంద్ సతీమణి రజినీకి వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవి: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఉజ్వలమైన భవిష్యత్తు ఉన్న ఇద్దరు యువ నాయకులు అకాల మరణం చెందడం పట్ల సిఎం కెసిఆర్ ను ఎంతగానో కలిసివేసిందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ తెలిపారు.  టిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు కుసుమ జగదీష్, వేద సాయి చంద్ అకాల మరణానికి మంత్రి కెటిఆర్ సంతాపం తెలిపారు. తెలంగాణ భవన్ లో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారకరామారావు మాట్లాడారు.  వారి కుటుంబ పరిస్థితులు తెలుసుకొని, వారి యోగక్షేమల కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితర 150 మందికి పైగా ప్రజాప్రతినిధుల ఒక నెల జీతం సుమారు మూడు కోట్లకు పైగా ఆ రెండు కుటుంబాలకు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు.

ఇరు కుటుంబాలకు కోటిన్నర చొప్పున అందిస్తామన్నారు. కుసుమ జగదీష్, సాయి చందు తల్లిదండ్రులను కూడా పార్టీ తరఫున ఆదుకుంటామన్నారు. సాయిచంద్ సతీమణి రజినీకి వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని కూడా ఇవ్వాలని ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. పార్టీ కార్యకర్తలకు ఎక్కడ ఇబ్బంది కలిగినా పార్టీ నాయకత్వం అండగా ఉంటుందన్నారు. పార్టీ కార్యకర్తల శ్రమ, త్యాగాల వలన పార్టీ నిర్మాణమైందన్నారు.

Also Read: పవార్లలో ఎవరిది పైచేయి?

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News