- Advertisement -
న్యూఢిల్లీ: తెలంగాణ మాజీ గవర్నర్, బిజెపి నేత తమిళిసై సౌందర్ రాజన్ తెలంగాణ భవన్ ను సందర్శించారు. దానికి సంబంధించిన ఫోటోను ఆమె ఎక్స్ వేదికలో పంచుకున్నారు. రెసిడెంట్ కమిషనర్ ఐఏఎస్ గౌరవ్ ఉప్పల్ ఆమెకు స్వాగతం పలికారు. నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్న సందర్భంగా ప్రమాణస్వీకారోత్సవానికి తమిళిసై హాజరవుతున్నారు. అందుకే ఆమె న్యూఢిల్లీ వెళ్లారు. మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. దాదాపు 8 వేల మంది ప్రత్యేక అతిథులు హాజరుకానున్నారు.
Received a warm welcome at Telangana Bhavan, New Delhi by
Dr.Gaurav Uppal, IAS, Resident Commissioner in New Delhi. pic.twitter.com/MUt5UTmdin— Dr Tamilisai Soundararajan (மோடியின் குடும்பம்) (@DrTamilisai4BJP) June 8, 2024
- Advertisement -