మెల్‌బోర్న్: ఐపిఎల్ వేలం పాటలో సహచర ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ భారీ ధరకు అమ్ముడు పోవడం తనకు ఆశ్చర్యం కలిగించిందని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ పేర్కొన్నాడు. కిందటి సీజన్‌లో పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరిచిన మాక్స్‌వెల్ ఈసారి తక్కువ ధరకే అమ్ముడు పోతాడని తాను భావించానన్నాడు. అయితే బెంగళూరు జట్టు మాక్స్‌వెల్ కోసం భారీ మొత్తంలో ఖర్చు చేయడం తనకు ఆశ్చర్యం కలిగించిందన్నాడు. ఇక ఈ వేలం పాటలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు కళ్లు చెదిరే ధరకు అమ్ముడు పోవడంపై వార్నర్ ఆనందం వ్యక్తం చేశాడు. ఇక తాను వచ్చే ఐపిఎల్‌లో బరిలోకి దిగడం ఖాయమన్నాడు. గాయం ఇంకా వెంటాడుతూనే ఉన్నా తాను ఐపిఎల్ ఆరంభం నాటికి ఫిట్‌నెస్ సంతరించుకుంటాననే నమ్మకాన్ని వ్యక్తం చేశాడు. ఇక తాను గాయం నుంచి పూర్తిగా కోలుకోవాలంటే మరి కొన్ని నెలల సమయం పట్టే అవకాశం ఉందన్నాడు. అయితే క్రికెట్‌కు దూరంగా ఉండేంత తీవ్రత ఆ గాయానికి లేదని వైద్యులు తేల్చారన్నాడు. దీంతో తాను వచ్చే నెలలో జరిగే దేశవాళి క్రికెట్ టోర్నీలో బరిలోకి దిగుతున్నట్టు వార్నర్ వివరించాడు.
Warner mocks Maxwell over his Rs 14.25 cr at IPL