హైదరాబాద్: ఆస్ట్రేలియా ఓపెనర్ డెవిడ్ వార్నర్ టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలకడంతో ఆసీస్ ఓపెనర్‌గా గురించి చర్చ జరుగుతోంది. గత 13 ఏళ్ల నుంచి వార్నర్ టెస్టుల్లో ఓపెనర్ ఆడి మంచి భాగస్వామ్యాలు నెలకొల్పాడు. వార్నర్ వారసుడు ఎవరు అనేది ప్రశ్నగా మారింది. ఓపెనర్‌గా స్టీవ్ స్మిత్ కరెక్ట్ బ్యాట్స్‌మెన్ అని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ తెలిపాడు. ఆసీస్ ఇన్నింగ్స్ స్మిత్ ప్రారంభిస్తే 400 పరుగుల రికార్డును బద్దలు కొట్టగలడని అభిప్రాయపడ్డాడు. ఇఎస్‌పిఎన్ క్రిక్ ఇన్‌ఫోలో ఆరౌండ్ ది వికెట్ షోలక్ష మైకేల్ క్లార్క్ మాట్లాడారు. స్టీవ్ స్మిత్ ఓపెనర్‌గా రావాలనుకుంటే అతడి ఆస్ట్రేలియా జట్టు అవకాశం ఇవ్వాలని క్లార్క్ డిమాండ్ చేశారు.
2024 డిసెంబర్ వరకు స్మిత్ టెస్టుల్లో నెంబర్ వన్ బ్యాట్స్‌మెన్ అవుతాడని చెప్పారు. ప్రస్తుతం స్మిత్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తుండడంతో ఏ స్థానంలో అయినా బ్యాటింగ్ చేసే సత్తా స్మిత్‌లో ఉందన్నారు. స్మిత్ బ్యాటింగ్ టెక్నిక్ అద్భుతంగా ఉంటుందని, బంతిని చక్కగా గమనిస్తాడని, కొన్ని సార్లు ఎల్‌బిడబ్లు రూపంలో ఔట్ అవుతుంటాడని, ఏ బ్యాటర్ ఎల్‌బిడబ్లు రూపంలో ఔట్ కాలేదని ప్రశ్నించారు. స్మిత్ ఓపెనర్‌గా వస్తే 12 నెలల్లో బ్రియన్ లారా 400 పరుగుల రికార్డును బద్దలు కొడుతాడని క్లార్క్ జోస్యం చెప్పారు. ఆయన రొజంతా బ్యాటింగ్ చేయగల ధీరుడు అని ప్రశంసించారు. స్మిత్ 105 టెస్టులు ఆడి 9514 పరుగులు చేశాడు. 32 శతకాలు బాదగా 40 అర్థ శతకాలు చేశాడు. అత్యధికంగా 239 పరుగులు చేశాడు.