Friday, December 20, 2024

వన్డేలకు వార్నర్ గుడ్‌బై

- Advertisement -
- Advertisement -

సిడ్నీ: ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ వన్డే మ్యాచ్‌లకు గుడ్‌బై చెప్పాడు. దీంతో క్రికెట్ అభిమానులు షాక్ గురయ్యారు. వరల్డ్ కప్‌లో ఫైనల్ మ్యాచ్ చివరి వన్డే అని వార్నర్ వెల్లడించారు. గతంలో టెస్టులకు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. టి20 ప్రపంచకప్‌లో ఆడుతానని వివరణ ఇచ్చారు. 2025 జరిగే ఛాంపియన్స్ ట్రోఫికి అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. 161 వన్డేలు ఆడి 6932 పరుగులు చేశాడు. వన్డేలలో 22 సెంచరీలు, 33 హాఫ్ సెంచరీలు చేశాడు. 2009లో జనవరిలో సౌతాఫ్రికాపై వన్డే కెరీర్ ప్రారంబించారు. వరల్డ్ కప్‌లో 11 మ్యాచ్‌లలో 535 పరుగులు చేశాడు. వరల్డ్ కప్ రెండు సెంచరీలతో పాటు ఆ హాఫ్ సెంచరీ చేశారు.
వార్నర్ 111 టెస్టులు ఆడి 8695 పరుగులు చేశాడు. టెస్టుల్లో 26 సెంచరీలు, 36 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టెస్టుల్లో అత్యధికంగా 335 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News