Tuesday, November 5, 2024

అంతర్జాతీయ క్రికెట్‌కు వార్నర్ వీడ్కోలు

- Advertisement -
- Advertisement -

సెయింట్ విన్సెంట్: ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ డేవిడ్ వార్నర్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇప్పటికే టెస్టు, వన్డే క్రికెట్‌కు వార్నర్ వీడ్కోలు పలికాడు. తాజాగా అంతర్జాతీయ టి20 నుంచి కూడా తప్పుకోవాలని నిర్ణయించాడు. వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న టి20 వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా సెమీస్‌కు కూడా చేరకుండానే ఇంటిదారి పట్టిన సంగతి తెలిసిందే. మరోవైపు వార్నర్ వరల్డ్‌కప్ ముగిసిన తర్వాత టి20ల నుంచి తప్పుకుంటానని ఇంతకు ముందే ప్రకటించాడు. ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా ప్రస్థానం ముగియడంతో వార్నర్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా వెల్లడించాడు.

వార్నర్ అంతర్జాతీయ టి20 కెరీర్‌లో 110 మ్యాచుల్లో ఆస్ట్రేలియాకు ప్రాతినిథ్యం వహించాడు. ఈ క్రమంలో ఒక శతకం, మరో 28 హాఫ్ సెంచరీలు సాధించాడు. టి20 3277 పరుగులను సాధించాడు. ఇదిలావుంటే ఐపిఎల్ వార్నర్‌కు మంచి పేరు తెచ్చి పెట్టింది. సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లకు అతను ప్రాతినిథ్యం వహించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News