Monday, December 23, 2024

తీన్మార్ మల్లన్నకు వార్నింగ్

- Advertisement -
- Advertisement -

కోహెడ : తీన్మార్ మల్లన్న నోరు అదుపులో ఉంచుకోవాలని, అనవసరంగా నోరు జారితే తాటతీస్తామని బిఆర్‌ఎస్ యువత మండల అధ్యక్షుడు జాలిగం శంకర్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. గురువారం కోహెడ మండలకేంద్రంలోని బిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మిడియా సమావేశంలో జాలిగం శంకర్ మాట్లాడుతూ… హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ నియోజకవర్గ అభివృద్దిపై నిరంతరం పాటుపడుతున్నారని, మెట్ట ప్రాంతం సస్యశ్యామలం చేయడం కోసం గౌరవెళ్లి ప్రాజెక్టును పూర్తి చేసి రైతుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని గుర్తు చేశారు. ప్రజల కష్ట, సుఖాల్లో వెన్నంటి ఉండే ఎమ్మెల్యే సతీష్‌పై తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోబోమని హెచ్చరించారు.

తీన్మార్ మల్లన్న జర్నలిజం ముసుగులో బిఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులను దూషిస్తూ, రాక్షసానందం పొందుతున్నారని మండిపడ్డాడు. ఎమ్మెల్యే సతీష్‌కి తీన్మార్ మల్లన వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేకుంటే తగిన రీతిలో బుద్ధి చెబుతామని హెచ్చరించారు. బిఆర్‌ఎస్ మండల ప్రధాన కార్యదర్శి పెరుగు నరేందర్ రెడ్డి, బిఆర్‌ఎస్ ఎస్సి సెల్ మండల అధ్యక్షుడు వేల్పుల శంకర్, మైసంపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు పోలవేని కుమారస్వామి యాదవ్, నాయకులు కన్నం రాజు, పెసరు సుధాకర్, పేర్యాల సంపత్‌రావు, పల్లపు మల్లేశం, అఖిల్, ఓవెజ్ తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News