Monday, December 23, 2024

వాసింహింగోలీ డెక్కన్ వాసిం రైల్వే లైన్ విద్యుదీకరణ పనులు పూర్తి

- Advertisement -
- Advertisement -

Washim Hingoli railway electrician work is completed

అందుబాటులోకి వచ్చిన 126 కి.మీల రైల్వే లైను

హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే పరిధిలోకి వచ్చే మహారాష్ట్రలోని అన్ని సెక్షన్లలో రైల్వే విద్యుదీకరణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. అందులో భాగంగా, అకోలాపూర్ణా విద్యుదీకరణ ప్రాజెక్టులో భాగంగా హింగోలీ డెక్కన్ వాసిం మధ్య 46.30 రూటు కి.మీల పనులు పూరవ్వడంతో మరో సెక్షన్‌లో విద్యుదీకరణ పూర్తయ్యి అందుబాటులోకి వచ్చిందని దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు. దీంతో అకోలాహింగోలీ డెక్కన్ స్టేషన్ల మధ్య 126 కి.మీల మేర విద్యుదీకరణ పూర్తయి నిరాటంకంగా రైల్వే లైన్ల అనుసంధానం అందుబాటులోకి వచ్చిందని అధికారులు తెలిపారు. అకోలాపూర్ణా సెక్షన్‌లో 209 కిమీల విద్యుదీకరణ ప్రాజెక్టు రూ.277 కోట్ల అంచనా వ్యయంతో 2017,18 సంవత్సరంలో మంజూరయ్యింది. ఇందులో అకోలాలోహోగడ్ మధ్య 34.5 రూటు కి.మీల విద్యుదీకరణ మార్చి 2021లో పూర్తి కాగా, లోహోగడ్‌వాసిం మధ్య 45.3 రూటు కి.మీల విద్యుదీకరణ మార్చి 2022లో పూర్తయ్యింది. ప్రస్తుతం వాసింహింగోలి డెక్కన్ మధ్య 46.3 రూటు కిమీల విద్యుదీకరణ పూర్తవడంతో మొత్తం ఈ సెక్షన్లో 126 కి.మీల విద్యుదీకరించిన రైల్వే లైనుతో నిరాటంకంగా రైలు ప్రయాణ సౌకర్యం ఏర్పడిందని అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టులో మిగిలిన హింగోలి డెక్కన్‌పూర్ణా సెక్షన్‌లోని 84 కిమీల మేర విద్యుదీకరణ పనులు వేగవంతంగా సాగుతున్నాయని దక్షిణమధ్య రైల్వే తెలిపింది.

అధికారులను, సిబ్బందిని అభినందించిన జిఎం
మహారాష్ట్రలో రైల్వే లైన్ల విద్యుదీకరణతో రైల్వే మౌలిక సదుపాయాలు పటిష్టమవుతున్నాయి. రద్దీ ప్రాంతాల్లో రద్దీని నివారించి సరుకు రవాణాతో పాటు ప్రయాణికుల రవాణా నిరాటంకంగా సాగడానికి తోడ్పడుతుంది. ఈ సెక్షన్లలో రైల్వే లైన్ల విద్యుదీకరణతో ఇంధన ఖర్చు తగ్గడం ద్వారా రైల్వేకు ప్రయోజనకరంగా ఉంటుంది. అంతేకాక కార్చన్ ఫుట్ పాయింట్ల ఉద్గారాలు తగ్గి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతుందని దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఈ విద్యుదీకరణ పనులను పూర్తి చేసిన దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయం ఎలక్ట్రిక్ విభాగం, నాందేడ్ డివిజన్ అధికారులను, సిబ్బందిని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ (ఇన్‌చార్జి) అరుణ్ కుమార్ జైన్ అభినందించారు. అకోలాపూర్ణా విద్యుదీకరణ ప్రాజక్టు పనులు నిర్ధేశిత సమయంలోగా పూర్తయ్యేలా ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టినట్లు ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News