కివీస్‌లో రెండు, మూడు టెస్టులకు భారత జట్టు ప్రకటన
ముంబై : తొలి టెస్టులో టీమిండియా ఓటమి తర్వాత భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) కీలక నిర్ణయం తీసుకుంది. కివీస్‌తో జరిగే రెండో, మూడో టెస్టు మ్యాచ్‌లకు కీలక మార్పులు చేస్తూ జట్టును ఎంపిక చేసింది. తుది జట్టులో ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్‌కు చోటు కల్పించింది. రంజీ ట్రోఫీలో తమిళనాడు తరఫున ఆడుతున్న వాషింగ్టన్ పుణెలో జట్టుతో చేరనున్నాడు.
ఇరు జట్ల మధ్య రెండో టెస్టు అక్టోబర్ 24 నుంచి పుణెలో జరగనుంది. అయితే, టీమ్‌లో ఇప్పటికే రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ వంటి ఆల్ రౌం డర్లు ఉన్నారు. రంజీ ట్రోఫీలో వాషింగ్టన్ సుందర్ నిలకడగా రాణిస్తున్నాడు. ఇటీవల అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీపై మూడో నంబర్‌లో బ్యాటింగ్‌కు దిగి 152 పరుగులు బాదడమే కాకుండా బాల్‌తో రెండు వికెట్లు సయిత ం పడగొట్టాడు. వాషింగ్టన్ చివరిసారిగా 2021 మార్చిలో అహ్మదాబాద్‌లో భారత్ తరఫున టెస్టు మ్యాచ్ ఆడాడు. అయితే గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు.
భారత జట్టు ఇదే..
రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్, వాషింగ్టన్ సుందర్.