Sunday, January 26, 2025

వన్డే సిరీస్‌కు సుందర్ ఎంపిక

- Advertisement -
- Advertisement -

 

Washington Sundar replaces Deepak Chahar for ODIs

రాంచీ: సౌతాఫ్రికాతో జరిగే చివరి రెండు వన్డేలకు ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌కు టీమిండియాలో చోటు లభించింది. గాయం బారిన పడిన దీపక్ చాహర్ స్థానంలో సుందర్‌ను జట్టులోకి ఎంపిక చేశారు. ఈ విషయాన్ని బిసిసిఐ శనివారం అధికారికంగా ప్రకటించింది. కాగా, సౌతాఫ్రికాతో ఆది, మంగళవారాల్లో రెండు వన్డేలు జరగాల్సి ఉంది. ఈ మ్యాచ్‌ల కోసం సుందర్‌కు జట్టులో చోటు కల్పించారు. సుందర్ కొంతకాలంగా టీమిండియాకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఇక బంతితో, బ్యాట్‌తో రాణించే సత్తా ఉన్న సుందర్‌ను చాహర్ స్థానంలో జట్టులోకి తీసుకున్నారు.

Washington Sundar replaces Deepak Chahar for ODIs

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News