Sunday, January 19, 2025

పాక్ గెలుపుకు ఐడియా ఇచ్చిన వసీం అక్రమ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వరల్డ్ కప్‌లో భాగంగా ఇంగ్లాండ్‌పై పాకిస్థాన్, దక్షిణాఫ్రికాపై ఆఫ్ఘానిస్తాన్ గెలిస్తే పది పాయింట్ల పట్టికలో రెండు జట్లు చేరుతాయి. కానీ పది పాయింట్లు ఉన్న న్యూజిలాండ్ జట్టు రన్‌రేటు ఆధారంగా సెమీస్‌కు చేరుతుంది. ఇప్పటికే భారత్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు సెమీస్‌కు చేరాయి. ఇంగ్లాండ్‌పై పాకిస్థాన్ 280 పరుగుల తేడాతో గెలిస్తే సెమీస్ చేరే అవకాశం ఉంది. ఇంగ్లాండ్ తొలుత బ్యాటింగ్ చేస్తే పాక్ జట్టు ఐదు ఓవర్లలో లక్ష్యాన్ని చేరితే గెలుస్తుంది. ఎలా చూసిన పాక్ సెమీస్ చేరే అవకాశాలు కనిపించడం లేదు.
పాక్ తొలుత బ్యాటింగ్ చేసిన తరువాత ఇంగ్లాండ్ జట్టు డ్రెస్సింగ్ రూమ్ చేరుకోగానే 20 నిమిషాల పాటు లాక్ చేస్తే ఇంగ్లాండ్ జట్టు టైమ్డ్ ఔట్ అవుతుందని వసీం అక్రమ్ చెప్పడంతో అక్కడ ఉన్నవారంతా నవ్వుల్లో తేలిపోయారు. వెంటనే మిస్బా ఉల్ హక్ కలుగజేసుకొని ఇంగ్లాండ్ బ్యాటింగ్ దిగే ముందు డ్రెస్సింగ్ రూమ్‌కు లాక్ చేస్తే టార్గెట్ కూడా ఉంచాల్సిన అవసరం ఉండదని చెప్పడంతో అందరూ నవ్వారు. బంగ్లాదేశ్-శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్ లో ఎంజెల్ మ్యాథ్యూస్ టైమ్ ఔట్ రూపంలో మైదానం వీడిన విషయం తెలిసిందే. టైమ్డ్ ఔట్ విధానంపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. శనివారం ఈడెన్ గార్డెన్ లో పాకిస్థాన్-ఇంగ్లాండ్ మధ్య మ్యాచ్ జరగనుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News