Tuesday, December 24, 2024

దశాబ్ది ఉత్సవాల పేరిట ప్రజా ధనం వృథా

- Advertisement -
- Advertisement -

హన్మకొండ :తెలంగాణ ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాల పేరిట విచ్చల విడిగా ప్రజా ధనాన్ని వృథా చేస్తున్నదని మాజీ డిసిసిబి చైర్మన్ శ్రీజంగారాఘవరెడ్డి అన్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఏఐసిసి, పిసిసి ఆదేశాల మేరకు గురువారం మాజీ డిసిసిబి చైర్మన్ శ్రీజంగారాఘవరెడ్డి ఆధ్వర్యంలో దశాబ్ది ఉత్సవాల పేరుట బిఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున్న ఆగడాలను ఎదిరిస్తూ ర్యాలీ నిర్వహించి హన్మకొండ ఎమ్మార్వో ఆఫీస్ ముందట కెసిఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

విచ్చలవిడిగా ప్రజాధనాన్ని వృథా చేయడం గురించి ఎమ్మార్వో కి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా విలేకరులతో జంగారాఘవరెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాల పేరు మీద విచ్చలవిడిగా ప్రజాధనాన్ని వృధా చేస్తూ తమ సొంత ప్రచారాల కోసం వాడుకుంటుందని అన్నారు. దీనిని అరికట్టవలసిందిగా మీకు మనవి ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చిన కొన్ని హామీలను అమలు అయ్యే విధంగా ప్రభుత్వం పై ఒత్తిడి తేవాలని కోరడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కట్లశ్రీనివాసరావు, జక్కులరవీందర్యాదవ్, 62వ డివిజన్ కార్పొరేటర్, 63వ డివిజన్ కార్పొరేటర్ విజయశ్రీరజాలి, హన్మకొండ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రేపల్లెరంగనాథ్, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కుడిపాకగణేష్, మాజీ కార్పొరేటర్ తొట్లరాజుయాదవ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుర్రపుకోటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News