నేచురల్ స్టార్ నాని వాల్ పోస్టర్ సినిమా సమర్పించిన మూవీ ‘కోర్ట్’ – స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’. ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. దీప్తి గంటా సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రం మార్చి 14న హోలీ పండుగ సందర్భంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ ప్రీరిలీజ్, ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని నిర్వహించారు. బ్లాక్‌బస్టర్ డైరెక్టర్స్ నాగ్ అశ్విన్, ప్రశాంత్ వర్మ, శైలేష్ కొలను, శ్రీకాంత్ ఓదెల, శౌర్యువ్, ఇంద్రగంటి మోహన కృష్ణ, దేవకట్టా ఈ వేడుకలో అతిధులుగా పాల్గొన్నారు. ప్రీరిలీజ్ ఈవెంట్ లో నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ “తెలుగు ప్రేక్షకులు ఇలాంటి మంచి సినిమాని మిస్ కాకూడదని చెబుతున్నాను. మీ అందరిని బ్రతిమాలుతున్నాను. ఫ్యామిలీతో కలిసి సినిమాకి వెళ్ళండి. గొప్ప సినిమా చూశామనే ఫీలింగ్‌తో వస్తారు. ఒకవేళ 14న కోర్ట్ సినిమాకి వెళ్లి నేను చెప్పిన అంచనాలని మ్యాచ్ కాలేదని అనిపిస్తే…ఇంకో రెండు నెలల్లో రిలీజ్ అవుతున్న నా హిట్ 3ని ఎవరూ చూడొద్దు. ఇంతకంటే బలంగా చెప్పలేను”అని అన్నారు. ప్రియదర్శి మాట్లాడుతూ “ఇది కూడా ఒక సూపర్ హీరో లాంటి కథ. కోటేసుకున్న ప్రతిసారి ఒక బ్యాట్మెన్‌లా ఫీల్ అయ్యా”అని తెలిపారు. డైరెక్టర్ రామ్ జగదీష్ మాట్లాడుతూ “నాని సినిమాను నమ్మిన విధానం అద్భుతం. అది చాలా బాధ్యత పెంచింది. 14 తారీకున ఆ నమ్మకాన్ని తిరిగి ఇచ్చేస్తాను. కోర్టు మన అందరికీ జీవితం. థియేటర్స్‌కి రండి. ఆ రోజు మాట్లాడుకుందాం”అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రశాంతి తిపిర్నేని, దీప్తి గంటా, విజయ్ బుల్గానిన్, పూర్ణాచారి, శివాజీ, హర్ష రోషన్, శ్రీదేవి, రోహిణి, శ్రీనివాస్ భోగి రెడ్డి, సురభి ప్రభావతి పాల్గొన్నారు.
‘కోర్ట్’ను ఫ్యామిలీతో కలసి చూడండి: నాని
- Advertisement -
- Advertisement -
- Advertisement -