Monday, September 23, 2024

పిల్లల బూతు సినిమాలు చూడ్డం నేరమే: సుప్రీం కోర్టు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: పిల్లల బూతు సినిమాలు చూడ్డం, అలాంటి వీడియోలను డౌన్ లోడ్ చేసుకోవడం నేరమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పిల్లల బూతు సినిమాలు చూడ్డం పోస్కో చట్టం కింద నేరం కాదని  మద్రాసు హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ పై సుప్రీం కోర్టు ఈ తాజా స్పష్టీకరణ ఇచ్చింది. అంతేకాక మద్రాసు హైకోర్టు తీర్పును పక్కనపెట్టింది. కాగా మద్రాసు హైకోర్టు అలాంటి తీర్పునిచ్చి తప్పిదం చేసిందని ప్రధాన న్యాయమూర్తి డివై. చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది. చైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోలను డౌన్లోడ్ చేసుకున్న 28 ఏళ్ల యువకుడి పై మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ అనేక ఎన్జీవోలు, చిన్నారుల సంక్షేమ సంఘాలు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాయి. దాంతో సుప్రీంకోర్టు మద్రాస్ హైకోర్టు తీర్పును తోసిపుచ్చింది. సదరు యువకుడిపై క్రిమినల్ చర్యలను పునరుద్ధరించాలని పేర్కొంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News