Sunday, December 22, 2024

వర్షాలతో జంట జలాశయాలకు జలకళ

- Advertisement -
- Advertisement -
ఎగువ ప్రాంతాల నుంచి చేరుతున్న వరద నీరు
హిమాయత్ సాగర్ రిజర్వాయర్ రెండు గేట్లు అడుగు మేర ఎత్తివేత
మూసీ నదిలోకి 700 క్యూసెక్కుల వరద నీరు విడుదల
అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎండి దానకిశోర్ సూచన

హైదరాబాద్ : ఎగువ ప్రాంతాల్లో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో జంట జలాశయాలైన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్‌కు వరద నీరు ఉదృతంగా ప్రవహిస్తుంది. దీంతో హిమాయత్ సాగర్ రిజర్వాయర్ రెండు గేట్లను శుక్రవారం జలమండలి అధికారులు ఎత్తారు. రిజర్వాయర్ రెండు గేట్లను ఒక ఫీటు మేర ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం హిమాయత్ సాగర్ కు 1200 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా, 700 క్యూసెక్కుల అవుట్ ఫ్లో ఉంది. మరోవైపు ఉస్మాన్ సాగర్ (గండిపేట్) రిజర్వాయర్‌కు 700 క్యూసెక్కుల వదర నీరు చేరుతోంది. రిజర్వాయర్ మొత్తం సామర్థ్యం 3.9 టీఎంసీలు కాగా ప్రస్తుతం 2.760 టీఎంసీలు. పూర్తి స్థాయి నీటి మట్టం 1790 అడుగులు కాగా ప్రస్తుతం 1785.15 అడుగులు ఉంది. జలాశయాల గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసినందున ఎండీ దానకిశోర్ సంబంధిత జలమండలి అధికారులతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిపాలనా యంత్రాంగాలు, జీహెచ్‌ఎంసీ, పోలీసు అధికారులను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

హిమాయత్ సాగర్ రిజర్వాయర్ వివరాలు:
పూర్తి స్థాయి నీటి మట్టం : 1763.50 అడుగులు
ప్రస్తుత నీటి స్థాయి : 1762.75 అడుగులు
రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం : 2.970 టీఎంసీలు
ప్రస్తుత సామర్థ్యం : 2.650 టీఎంసీలు
ఇన్ ఫ్లో : 1200 క్యూసెక్కులు
అవుట్ ఫ్లో : 700 క్యూసెక్కులు
మొత్తం గేట్ల సంఖ్య : 17
ఎత్తిన గేట్ల సంఖ్య : 02

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News