Sunday, January 12, 2025

మిషన్ కాకతీయతో చెరువులకు జల కళ

- Advertisement -
- Advertisement -

 

  • నీటి నిల్వ సామర్థం పెంపుతో రైతులకు తీరిన నీటి కొరత
  • సాగునీటి సౌకర్యంతో పెరిగిన రైతుల ఆదాయం
  • సాగు దండగ నుంచి సాగు భేష్‌గా మారిన తెలంగాణ
  • విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి

కందుకూరు: ఎన్నో ఏళ్లుగా సాగు దండగ అన్న ప్రాంతాల్లో సాగుతో బంగారం పండిస్తున్న ప్రాంతాలుగా మార్చి నేడు రైతులను రాజుగా మార్చిన ఘనత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో తీరిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి. సబితాఇంద్రారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాల్లో మార్పు సాధించాలనే పట్టుదలతో రాష్ట్ర ముఖ్యమంత్రి ముందస్తు చర్యలతో మిషన్ కాకతీయ, మిషన్ భగీరథతో నీటి సమస్యతో అల్లాడుతున్న ప్రాంతాల్లో నీటిని పారించి భగీరథుడిగా మారాడు కెసిఆర్ అని అన్నారు.

మంగళవారం మహేశ్వరం నియోజకవర్గంలోని పోతర్ల బాబయ్య ఫంక్షన్‌హాల్ లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో బాగంగా ఏర్పాటు చేసిన సాగునీటి దినోత్సవంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గడిచిన 9 ఏళ్ల కాలంలో మిషన్ కాకతీయ ద్వారా రాష్ట్రంలో 27 వేల చెరువులలో, కుంటలలో పూడిక తీయించి ఎలాంటి నీటి కొరత రాకుండా చర్యలు తీసుకున్నారో నాడు వేసవిలో కుడా నీటి కళతో చెరువులు , కుంటలు జలకళను సంతరించుకున్నాయన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును పూర్తిచేసి వినియోగంలో తీసుకోని రావడానికి కృషిచేస్తున్నట్లు దీని ద్వారా జిల్లాలో 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందుబాటులోకి వస్తుందన్నారు.

కృష్ణ బ్యాక్ వాటర్ ప్రాజెక్టు చేపట్టాలని ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారన్నారు. గోదావరిలో 32 టిఎంసిలు, కృష్ణాలో 23 టిఎంసిల నీటితో ఆయా ప్రాంతాల్లో ప్రాజెక్టులు కట్టుకోని తాగునీటిని ప్రభుత్వం అందిస్తుందన్నారు. తాగునీటి సమస్య తీరిన తర్వాత సాగునీటిని రైతులకు అందుబాటులోకి తీసుకువస్తున్నారన్నారు. రంగారెడ్డి జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు 2014లో 40 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండితే నేడు 3 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండిస్తున్నామన్నారు. నేడు వరి ధాన్యం పండించడంలో పంజాన్ రాష్ట్రాన్ని మించి పండించడం జరుగుతుందని తెలిపారు.

మిషన్ కాకతీయ ద్వారా ఎన్నడూ లేని విధంగా చెరువుల్లో, కుంటల్లో నీటి నీల్వ సామర్థం పెరగడం ద్వారా చేపలు వదులుతూ మత్స కారులకు ఆర్థికంగా లబ్ధిచేకూరుతుందన్నారు. స్వర్గీయ ఇంద్రారెడ్డి తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు తెలంగాణ పదం పలకడానికి భయపడే రోజుల నుండి నేడు తెలంగాణ యాసలో సినిమాలు, తెలంగాణ బిడ్డలు హీరోలుగా మారి ప్రజాదరణ పొందుతున్నారని అన్నారు. బంగారు తెలంగాణలో ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేసి మరింత అభివృద్ధి పర్చుకోవాలని అన్నారు.

మెట్ల బావికి రూ.90 లక్షల నిధుల మంజూరు

మహేశ్వరం గడికోటలో గల మెట్లబావి పునరుద్ద్ధరణకు మహర్ధశ లభించింది. సుమారు రూ.90 లక్షల నిధులతో ప్రాచీన వారసత్వ సంపదను కాపాడుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి పథకాల్లో మెట్టబావి ( కోనేరు) ను భవిష్యత్తు తరాల వారికి అందించడానికి పునరుద్ద్ధరణ పనులు చేపడుతున్నారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.. అనేక ఏండ్ల చరిత్ర కల్గిన మహశ్వరం గడికోటతో పాటు మహేశ్వరం శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం అభివృద్ధ్దికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ఈ ప్రాంతాన్ని పాలించిన అక్కన్నమాదన్నల పేరు భవిష్యత్తు తరాల ప్రజలకు గుర్తుండేలా ఈ ప్రాంతాన్ని అభివృద్ద్ది చేసే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు.

అనంతరం మహేశ్వరం మండల పరిషత్ కార్యాలయంలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం క్రింద ఆడబిడ్డలకు మంజూరైన చెక్కులను స్థానిక ఎంపిపి రఘుమారెడ్డి, వైస్ ఎంపిపి సునితా ఆంద్యానాయక్, మహేశ్వరం సర్పంచ్ కర్రోళ్ల ప్రియాంకలతో కలిసి లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దయానంద్, కందుకూరు జడ్పిటిసి జంగారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్ రెడ్డి, సర్పంచులు, ఎంపిటిసిలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News