Sunday, January 19, 2025

ఎంఎల్ సి కవితకు కృతజ్ఞతలు తెలిపిన వాటర్ బోర్డు నాయకులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ పులిమామిడి నారాయణ ఆధ్వర్యంలో వాటర్ బోర్డులో ఔట్‌సోర్సింగ్ కార్మికులకు సిఎం కెసిఆర్ వేతనాలు పెంచాలని నిర్ణయించిన సందర్భంగా బుధవారం ఎమ్మెల్సీ కవిత కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌టియు రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు యాదవ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు వేముల మారయ్య యూనియన్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి ,కుమార్ ,జట్ట జగన్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జీవో 60 ద్వారా వేతనాలు పెరగడానికి సంపూర్ణ సహకారాలు అందించిన ఎమ్మెల్సీ కవిత గారికి 4000 మంది వాటర్ బోర్డు కార్మికులు రుణపడి ఉంటారని కనీస వేతనాలు సలమండలి చైర్మన్ నారాయణ తెలిపారు. ఔట్‌సోర్సింగ్ కార్మికులంతా ప్రభుత్వానికి, సిఎం కెసిఆర్‌కు మంచి పేరు వచ్చే విధంగా మరింత కష్టపడి పని చేస్తారని హామీ ఇవ్వడం జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News