Wednesday, November 13, 2024

సాగర్‌లో మళ్లీ ఫైట్?

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/నాగార్జునసాగర్:తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ జలవివాదం మొదలైంది. వాస్తవంగా ఈ సంఘటన శుక్రవారం మధ్యాహ్నం జరుగగా నాగార్జునసాగర్ డ్యాం అధికారులు ఇది సున్నితమైన విషయంగా భావించి ఉన్నతాధికారులకు ఇచ్చిన సమాచారాన్ని బయటికి రా కుండా జాగ్రత్త పడ్డారు. ఆలస్యంగా అందిన సమాచారం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఇరిగేషన్ శాఖ అధికారులు, సిబ్బంది శుక్రవారం కుడి కాలువపై ఏ ర్పాటు చేసిన వాటర్ గేజ్ వద్ద వాటర్ రీడింగ్ తీసుకోకుండా ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఇ రిగేషన్ శాఖ అధికారులు అడ్డుపడ్డారని తెలుస్తోంది. ఈ దశలో రెండు రాష్ట్రాలకు చెందిన ఇరిగేషన్ శాఖకు చెందిన సిబ్బంది మధ్య వాగ్వాదం జరిగి,

చివరకు ఒకరినొకరు తోసుకోవడం వరకు వ్యవహారం వెళ్ళింది. ఈ దశ లో ఆంధ్ర ప్రాంత ఇరిగేషన్ శాఖ అధికారు లు కుడి కాలువకు సంబంధించిన నీటి విడుదల లెక్కలు చెప్పాలని, రీడింగులు తీయవద్దని… మీరు ఎవరికైనా చెప్పుకోండని… బెదిరింపు ధోరణితో వ్యవహరించారని తెలంగాణ ప్రాంత ఇరిగేషన్ శాఖకు చెందిన అధికారు లు, కిందిస్థాయి సిబ్బంది పేర్కొంటున్నారు. జరిగిన విషయాన్నంతటినీ తెలంగాణ అధికారులు అదే రోజు రాష్ట్ర ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులకు, కృష్ణా రివర్ మేనేజ్‌మెట్ బోర్డ్ అధికారులుకు తెలియజేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా కెఆర్‌ఎంబి అధికారులు కలుగజేసుకోవాలని, డ్యాంపై కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని పలువురు ప్రజా సంఘాల నాయకులు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News