- Advertisement -
నిర్మల్ జిల్లా : కడెం ప్రాజెక్ట్ కు వరద నీరు భారీగా చేరుతుండడంతో నిండు కుండలా మారింది. అధికారులు 5 గేట్లు ఎత్తి గోదావరిలోనికి నీటిని వదిలారు. కడెం ప్రాజెక్ట్ ఎగువన శనివారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్ట్ లోకి భారీగా వరద నీరు చేరింది. అధికారులు 5 అడుగుల మేర 5 గేట్లను ఎత్తి గోదావరి లోకి నీటిని వదులుతున్నారు. పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 696.775 అడుగులుగా ఉందని అధికారులు వెల్లడించారు.
- Advertisement -