Monday, January 20, 2025

అట్టహాసంగా మంచినీళ్ల పండగ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా మంచినీళ్ల పండగ అట్టహాసంగా జరిగింది. గ్రామాల్లో పండగ వాతావరణం తలపించేలా స్థానిక ప్రజలతో మిషన్ భగరథ ఉద్యోగులు ర్యాలీలు నిర్వహించారు. మిషన్ భగీరథ శుద్ది కేంద్రాల వద్ద బతుకమ్మ, బోనాల ఆటలు, ముగ్గులతో అందగా ఆలంకరణ గ్రామ సిబ్బంది చేశారు. ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు, వివిధ వర్గాల ప్రజలతో మిషన్ భగీరథ ఫిల్టర్ బెడ్స్, వాటర్ ట్రిట్‌మెంట్ ప్లాంట్ల సందర్శించారు. నీళ్లను శుభ్రం చేస్తున్న తీరును, ఇంటింటికి నల్లాల ద్వారా సరఫరా చేస్తున్న తీరును ప్రజలకు వివరించారు. మిషన్ భగీరథ ద్వారా తాగునీటి ఇబ్బందులు లేకుండా చేసిన ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్‌కే దక్కుతుందన్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ పల్లెలు నీటి సమస్యలతో అనేక కష్టాలు పడ్డారని, మంచినీటి బావులు, బోర్లు ఎండిపోయి దూరంగా ఉన్నబావులు, చెరువుల, కుంటలకు వెళ్లి కుండల ద్వారా నీటి తెచ్చుకున్న సరిపోయేవి కాదని గుర్తు చేశారు. గ్రామాల్లో మహిళలతో సభ నిర్వహించి గతంలో మంచినీటి కోసం పడ్డ కష్టాలను బిందెడు నీళ్ల కోసం వీధి పోరాటాలు చేయాల్సిన వచ్చిన పరిస్థితిని తెలియజేశారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి ఉచితంగా నల్లాలు బిగించి ఉచితంగా స్వచ్చమైన సురక్షితమైన నీటిని సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో సెర్ప్ ఉద్యోగులను భాగస్వామ్యం చేసి దశాబ్ది ఉత్సవాల గురించి ప్రజలు వివరించారు.

అపర భగీరథుడు సిఎం కెసిఆర్: మంత్రి కొప్పుల ఈశ్వర్ 
మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మంచినీటిని అందిస్తున్న అపర భగీరథు సిఎం కెసిఆర్ అని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో తెలంగాణ మంచినీటి పండగ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాటర్ ఫిల్టర్ బెడ్‌ను స్దానిక ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించి, నీటి సరఫరా జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు.

ప్లోరైడ్ తరిమికొట్టిన ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్‌దే: మంత్రి జగదీష్‌రెడ్డి
ప్రజలకు బాధను ఏనాడు పట్టించుకున్న పాపాన పోని కాంగ్రెస్ నాయకులు నల్లగొండ జిల్లాలో ఫ్లోరోసిన్‌ను పెంచి పోషించారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి ఆరోపించారు. ప్లోరోసిస్‌ను అంటగట్టిన కాంగ్రెస్ నాయకులకు తగిన బుద్ది చెప్పాలని చెప్పాలని పిలుపునిచ్చారు. సిఎం కెసిఆర్ అధికారం చేపట్టిన తరువాత ప్లోరోసిస్‌ను మాటుమాయం చేశారని పేర్కొన్నారు. రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో బాగంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఇమాంపేట మిషన్ భగీరథ ప్లాంట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మంచినీటి పండుగ సంబురాల్లో పాల్గొన్ని ఇంటింటికి తాగునీరు సరఫరా అవుతుందని, కాంగ్రెస్ పాలనలో మురికినీరు అందిందని, నీటి కొరత కారణంగా ప్రతిరోజు నల్లాల వద్ద నీటి యుద్దాలు జరిగేవన్నారు.

80 శాతం రక్షిత మంచినీటిని సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ: మంత్రి శ్రీనివాస్‌గౌడ్
తెలంగాణ రాష్ట్ర ఆవతరణ దశాబ్ద ఉత్సవాల్లో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లా మహబూబ్‌నగర్ గ్రామీణ మండలం మన్యంకొండలో మిషన్ భగీరథ ట్రీట్మెంట్ ప్లాంట్ వద్ద నిర్వహించిన మంచినీళ్ల పండుగ కార్యక్రమానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. గతంలో తాగునీటి కోసం మహిళ కిలో మీటర్ల దూరం నడిచి బిందె మీద బిందె పెట్టుకొని తెచ్చుకున్న పరిస్థితులు ఉండేవన్నారు. ప్రభుత్వం సాధించిన అభివృద్దికి గుర్తుగా తెలంగాణ రాష్ట్ర ఆవతరణ దశాబ్ది ఉత్సవాలను చేసుకుంటున్నామని, ముఖ్యంగా ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి ఇంటింటికి తాగునీరు అందించే మిషన్ భగీరథ పథకాన్ని సిఎం కెసిఆర్ ప్రవేశపెట్టారని, ఇది ఏ రాష్ట్రంలో లేదని, ఇది దేశం యావత్తు ప్రశంసిస్తున్న పథకం అని అన్నారు. అన్ని నీటి శుద్ది కేంద్రాల వద్ద రాష్ట్ర వ్యాప్తంగా మంచినీళ్ల పండుగ నిర్వహించడం జరుగుతున్నదని, ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులకు, ప్రజల మిషన్ భగీరథ మంచినీటిని ఇంటింటికి ఇవ్వడానికి పడుతున్న శ్రమను, ఖర్చును, పద్దతులపై అవగాహన కల్పించాలని కోరారు.

తెలంగాణ మారుమాల గ్రామాలకు నీటి వసతి: సబితా ఇంద్రారెడ్డి
రాష్ట్రంలోని మారుమూల గ్రామానికి సైతం త్రాగునీరు అందించిన ఘనత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు దక్కిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి. సబితాఇంద్రారెడ్డి అన్నారు. తెలంగాణ దశాబ్ధి ఉత్సవాలలో భాగంగా కందుకూరు మండల పరిధిలోని ముచ్చర్లలో మంచినీటి పండుగను పాల్గొన్నారు. మిషన్ భగిరథ పథకం ద్వారా ఇంటింటికి నల్లాల ద్వారా మంచినీటిని అందించి మహిళల నీటి కష్టాలు దూరం చేశారన్నారు. గతంలో నీటి సరఫరా సరిగ్గా లేని కారణంగా సీజనల్ వ్యాదులు, ప్లోరోసిస్ సమస్యలు ఉత్పన్నమయ్యేవని నేడు అలాంటి సమస్యలు లేకుండా చేశారని అన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో పెరుగుతున్న నగర, మున్సిపాలిటిల జనాభాకు అనుగుణంగా 210 కోట్లతో నూతన పైప్‌లైన్లు, రిజర్వాయర్లు, వాటర్ ట్యాంకులు నిర్మిస్తున్నామన్నారు. ముచ్చర్ల నీటి శుద్దికరణ కేంద్రంలో త్రాగునీటి శుద్దికరణను పరిశీలించి ప్రతిరోజు ఏంత జనాభాకు నీటి సరఫరా చేస్తున్నారో సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.
గ్రామాల్లో ఏ ఆడబిడ్డ బిందె పట్టుకుని వీధుల్లోకి రావద్దనే మిషన్ భగీరథ ః ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్
తెలంగాణ పల్లెల్లోని ఏ ఆడబిడ్డ మంచినీళ్ల కోసం బిందె పట్టుకొని వీధుల్లోకి రావొద్దనే గొప్ప సంకల్పంతో మిషన్ భగీరథ పథకానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టినట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా మహమూబాబాద్ జిల్లా అబ్బాయపాలెంలోని ఎంఎల్డీ నీటి శుద్ధి కేంద్రం వద్ద తెలంగాణ మంచినీళ్ల పండగ నిర్వహించారు. కార్యక్రమానికి మంత్రి సత్యవతి రాథోడ్‌తో కలిసి దయాకర రావు పాల్గొన్నారు. పాలకుర్తి, మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాల నుంచి ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు తరలివచ్చారు. ఈ సందర్భంగా మిషన్ భగీరథ నీటి నాణ్యతను పరిశీలించి, నీటి శుద్ధి తీరు, నాణ్యతా ప్రమాణాలను వివరించారు.

ప్రతి ఒక్కరికీ స్వచ్ఛమైన, సురక్షితమైన, శుద్ధి చేసిన జలాలను అందించడమే మిషన్ భగీరథ లక్ష్యమని తెలిపారు. సీఎం కేసీఆర్ సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో 1996లో పూర్తి చేసిన సిద్దిపేట సమగ్ర తాగునీటి పథకమే మిషన్ భగీరథకు స్ఫూర్తి అని తెలిపారు. పథకం తెలంగాణలోని ప్రతి ఇంటికి నల్లాల ద్వారా నీళ్లు అందుతున్నాయన్నారు. మహబూబాబాద్ జిల్లాలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు మంచినీటి కోసం చేదబావులు, బోర్లు, చెలిమలు, వ్యవసాయ బావులు, మినీ పీడబ్ల్యూఎస్ స్కీములు, పీడబ్ల్యూఎస్ పథకాలు వాడకంలో ఉండేవన్నారు. ఎండాకాలం నీటి ఎద్దడి విపరీతంగా తాగునీటికి కొరత ఏర్పడేదని, నీటి కొరతతో చాలా దూరం ప్రయాణించి నీటిని తెచ్చుకునేవారని గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రతి గ్రామంలో మంచినీటి సమస్య పరిష్కారానికి దూరదృష్టితో మిషన్ భగీరథ కార్యక్రమం చేపట్టిందన్నారు.

మిషన్ భగీరథ నీరు భగవంతుడిచ్చిన స్వచ్ఛమైన నీరు: స్పీకర్ పోచారం
మిషన్ భగీరథ నీటిలో ఖనిజ లవణాలు తగు మోతాదులో ఉండడం వల్ల కిడ్నీ ఇతర అనారోగ్య సమస్యల బారినపడకుండా కాపాడుతుందని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో మిషన్ భగీరథ నీళ్లు ప్రతి కుటుంబానికి ఒక్కొక్కరికి 100 లీటర్లు చొప్పున సరఫరా చేయడం జరుగుతోందన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలోని మిషన్ భగీరథకు రూ.500 కోట్లు ఖర్చుచేసి 70వేల కుటుంబాలకు నీరు సరఫరా చేయడం జరుగుతోందన్నారు. దేశంలో మొదటిసారిగా ప్రతి ఇంటికి నల్లా పెట్టించిన ఏకైక ముఖ్యమంత్రి కెసిఆర్ అని అన్నారు. చందూరు బస్టాండ్ నుంచి జలాల్‌పూర్ గ్రామం వరకు డబుల్ రోడ్డు కోసం 14 కోట్లు మంజూరయ్యాయని స్పీకర్ వెల్లడించారు. చందూర్ కొత్త మండలానికిగాను ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మంజూరైందన్నారు. చందూరు సర్పంచ్ కర్లం సాయిరెడ్డి 24గంటల నీళ్ల సరఫరాకు ఒక లక్ష 20వేల లీటర్ల ట్యాంక్‌ను, మహిళా సమాఖ్య భవనం మంజూరు చేయాలని కోరగా స్పీకర్ మంజూరుకు హామీ ఇచ్చారు. ఈకార్యక్రమంలో కెసిఆర్ కిట్ బాలింతలకు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాల గురించి వివరించారు.

సీఎంకు జవహర్‌నగర్ ప్రజలు జీవితాంతం రుణపడి ఉంటారు : మంత్రి మల్లారెడ్డి
మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి ఇంటికి స్వచ్ఛమైన మంచినీటిని అందిస్తున్నామని,ఈ విషయంలో సీఎం కెసిఆర్‌కు జవహర్‌నగర్ ప్రజలు జీవితాంతం రుణపడి ఉంటారని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగం మెట్రో వాటర్ వర్క్ ఆధ్వర్యంలో నిర్వహించిన మంచినీళ్ల పండుగ హాజరై మాట్లాడుతూ ఒకప్పుడు జవహర్‌నగర్‌లో మంచినీటి కోసం మహిళలు ఎంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో ఏర్పడిన మిషన్ భగీరథ పథకంతో తెలంగాణ అంతట ఇంటింటికి స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తున్నామని తెలిపారు. జవహర్‌నగర్ చుట్టు రిజర్వాయర్,పైప్‌లైన్లు ఉన్నాయని,తాగటానికి ఎండకాలంలో కూడా ఇబ్బందులు ఉండవన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News