ఉద్యోగ ఖాళీల భర్తీపై అసెంబ్లీలో కెసిఆర్ ప్రకటనపై
దేశ్ కా నేత సిఎం కెసిఆర్ పేరిట
ఢిల్లీతో సహా పలు రాష్ట్రాల్లో ఏర్పాటైన భారీ ఫ్లెక్సీలు
మన తెలంగాణ/హైదరాబాద్: నీళ్లు, నిధులు, నియామకాలు నిజమయ్యాయి. నాటి కల నేడు సాకారమైంది. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, నిధులు, ప్రభుత్వ ఉద్యోగ నియామకాల విషయంలోనూ దేశంలోనే నెంబర్ 1గా తెలంగాణ రాష్ట్రం నిలిచింది. దేశంలో మొదటిసారి 91,142 ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేస్తామంటూ అసెంబ్లీలో ప్రకటన చేసిన సిఎం కెసిఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ దేశరాజధాని ఢిల్లీతో పాటు, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, జైపూర్ రాష్ట్రాల్లో దేశ్ కా నేత కెసిఆర్ అంటూ భారీ ఫెక్సీలు ఏర్పాటయ్యాయి. దేశానికి సిఎం కెసిఆర్ లాంటి వ్యక్తి కావాలి అంటూ దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. రైతులు, కూలీలు, ఉద్యోగులు, అందరికీ అన్నీ సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నది కెసిఆర్ సర్కార్ మాత్రమే. సిఎం కెసిఆర్ లాంటి నాయకుని సేవలు అవసరం ఎంతైనా ఉందన్న చర్చ దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. అనుకున్న విధంగా రాష్ట్ర కలను సాకారం చేయడంలోనూ.. ప్రధానంగా నీళ్లు, నిధులు, నియామకాల నినాదాన్ని సఫలీకృతం చేయడంలోనూ సిఎం కెసిఆర్ ముందు వరసలో నిలిచారు. దీంతో, ఒక్క రాష్ట్రానికి సిఎం కెసిఆర్ లాంటి వ్యక్తులు పరిమితం కాకూడదని.. దేశవ్యాప్తంగా కెసిఆర్ లాంటి నాయకుడి అవసరం ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతైనా ఉందని ప్రతి ఒక్కరూ చర్చిస్తున్నారు. ఒక్క రాష్ట్రంలోనే కాదు.. దేశవ్యాప్తంగా సిఎం కెసిఆర్‌కు కృతజ్ఞతలు వెల్లువెత్తుతున్నాయి.