Wednesday, January 8, 2025

వాటర్ గ్రిడ్ సంగతి అంతేనా….

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : మహానగరానికి భవిష్యత్తులో మంచినీటి కొరత రాకుండా జలమండలి పలు ప్రాజెక్టుల నిర్మాణాలు చేపడుతూ సకాలంలో ప్రజలకు నీటి సరఫరా చేస్తుంది. తరుచుగా నగరంలో పైపులైన్ దెబ్బతిని వాటర్ లీకేజీలు నిత్యం పెరిగిపోతుందడంతో శాశ్వత పరిష్కారం కోసం బోర్డు ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ జలవలయం (వాటర్ గ్రిడ్) ఏర్పాటుకు నాలుగేళ్ల ప్రతిపాదనలు తీసుకొచ్చి సంబంధించిన పనులు చేసేందుకు కూడా సిద్దమైంది. వారం రోజుల పాటు హడావుడి చేసిన అధికారులు తరువాత వెనకడుగు వేశారు. దీనిపై పలుమార్లు జలమండలి ఉద్యోగ సంఘాలు పనులు చేపట్టాలని ఉన్నతాధికారులను కోరారు.

మహానగరం చుట్టూ 158 కి.మీ మార్గంలో విస్తరిం చిన ఓఆర్ ఆర్ చుట్టూ రూ. 4725 కోట్ల అందనా వ్యయంతో 3000 ఎంఎం డయా వ్యాసార్ధంగల భారీ రింగ్మెయిన్ మంచినీటి పైప్ లైన్ ఏర్పాటు చేయడంతోపాటు కృష్ణా, గోదావరి, మంజీరా, సిం ఉస్మాన్సాగర్ జలాశయాల నీటిని నగరం నలువైపులా సరఫరా చేసేందుకు వీలుగా ఈగ్రిడ్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పనులకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సిద్ధం చేసింది. ఔటర్ చుట్టూ భారీ పైపరైన్ ఏర్పా అవసరమైన ప్రభుత్వస్థలం అందుబాటులో ఉండడంతో భూసేకరణకూ ఇబ్బందులు ఉండవని నిపుణులు స్పష్టంచేస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ కృష్ణా, గోదావరి. మం జీరా, సింగూరు, హిమాయత్ సాగర్, ఉస్మాన్‌సాగర్ జలాల నీటిని ఈ వాటర్ గ్రిడ్ రింగ్ మెయిన్ భారీ పైపులైన్‌ను అనుసంధానించేందుకు ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ 7 చోట్ల గ్రిడ్ జంక్షన్లను ఏర్పాటు చేయాలి.

పటాన్ చెరు వద్ద ఏర్పాటు చేయనున్న జంక్షన్‌కు మంజీరా నీళ్లు, కండ్లకోయ వద్ద ఎల్లంపల్లి జలాశయం నుంచి తరలించే గోదావరి జలాలను గ్రిడ్‌కు అనుసంధానించవచ్చు. ఇక శామీర్ పేట్ వద్ద కేశవాపూర్ లారీ స్టోరేజి రిజర్వాయర్ నుంచి తరలించే గోదావరి జలాలను గ్రిడ్ కు కలిపే వీలుంది. వెలిమాల జంక్షన్ వద్ద సింగూరు జలా లను గ్రిడు అనుసంధానించవచ్చు. జంట జలాశ యాలు హిమాయత్ సాగర్, ఉస్మాన్‌సాగర్ నీటిని కిస్మత్‌పూర్ వద్ద, బొంగ్లూరు జంక్షన్ వద్ద కృష్ణా మూడుదశల ప్రాజెక్టు నుంచి తరలించే కృష్ణా జలా లను కలిపే వీలుంటుందని జలండలి ఉన్నతాధికారులు వెల్లడిస్తున్నారు.

పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద నిర్మించనున్న దేవులమ్మ నాగారం నుంచి తరలించే కృష్ణా జలాలను పెద్ద అంబర్ పేట్ జంక్షన్ వద్ద గ్రిడ్‌కు అనుసంధానించేందుకు అవకాశం ఉంది. దీంతో ఆయా జలాశయాల నుంచి తరలించే నీటితో నిత్యం 600 మిలియన్ గ్యాలన్ల శుద్ధిచేసిన తాగునీరు ఈ గ్రిడ్‌లో నిరంతరం అందు బాటులో ఉంటుంది. ఈ నీటిని ఔటరింగ్‌రోడ్డు లోపల ఏ మూలకైనా తరలించే అవకాశం ఉంటుందని గ్రిడ్ వ్యవస్థతో జలమండలి పరిధిలోని 500 స్టోరేజి రిజర్వాయర్లలో నింపేందుకు అవకాశం ఉం ది. ఈ గ్రిడ్ లను ప్రధానంగా ఆయా జలాశయాల నుంచి వచ్చే నీటి పంపింగ్ అంతగా అవసరం. లేకుండా కేవలం గ్రావిటీ (భూమ్యాకర్షణ శక్తి) ద్వారానే నేరుగా గ్రిడ్ పైపులోనికి చేరే విధంగా అనుసంధానించనుండడం విశేషం.

ఈ వాటర్ గ్రిడ్ కాన్సెప్ట్ అమెరికా, బ్రిటన్ దేశాల్లోని పలు మహానగ రాల్లో అమల్లో ఉంది. ఆయా నగరాల అనుభవా లను కూడా పరిశీలించిన తరువాతే సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధం చేసినట్లు ఇంజనీర్లు చెబుతున్నారు. గ్రేటర్ జనాభా రోజు రోజుకు పెరిగిపోతుంది. 625 చద రపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన మహానగరంతో పాటు ఔటర్ రింగ్ రోడ్డుకు లోపల ఉన్న 183 గ్రామపంచాయతీలు, 07 నగరపాలక సం స్థల పరిధిలో నివసిస్తున్న సుమారు 1.20 కోట్ల మంది దాహార్తిని తీర్చేందుకు ఈ భారీ రింగ్ మెయిన్ పైప్ లైన్ వ్యవస్థను ఏర్పాటుచేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఓఆర్‌ఆర్ పరిధిలోని అన్ని నివాస, వాణిజ్య, పారిశ్రామిక సముదాయాలు, నూత నంగా ఏర్పాటుకానున్న టౌన్ షిప్ లు, కాలనీలకు నిరంతరాయంగా 24 గంటలపాటు కొరత లేకుం డా తాగునీటిని అందించడంతో పాటు అంతర్జా తీయ ప్రమాణాల ప్రకారం ప్రతీ వ్యక్తికి తల సరిగా నిత్యం 150 లీటర్ల తాగునీటిని అందించాలని ప్రభుత్వం జీహెచ్‌ఎంసీ ఎన్నికల సమయంలో నిర్ణయం తీసుకోవడంతో వాటర్ గ్రిడ్‌కు అవసరం ఏర్పడిందని బోర్డు అధికారులు పేర్కొంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News