Wednesday, January 22, 2025

మానవ జీవితానికి నీరు ఎంతో అవసరం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్‌:  మానన జీవితంలో నీటికి ఎంతో ప్రాముఖ్యచత ఉందని విరంచి ఆసుపత్రి సీఈవో డా.సాయి రవి శంకర్ పేర్కొన్నారు. సోమవారం వరల్డ్ పుడ్ దినోత్సవం పురస్కరించుకుని కళాశాల విద్యార్థులకు ప్రత్యేక పోస్టర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ నీరు భూమిపై ఉన్న జీవాల మనుగడకు ఎంతో ఆవశ్యకమైన అంశమే కాకుండా భూమి పై 50 శాతం భూభాగంలో నీటి వ్యాపించి ఉందని వివరించారు. మనం తినే ఆహార ఉత్పత్తితో పాటూ మన జీవన ప్రయాణం కూడా నీటిపై ఆధారపడ ఉందని అయితే దురదృష్టవశాత్తు నీటి వనరులు పరిమితంగా ఉండడంతో వాటి వృధా అరికట్టి కాపాడుకోవాలని సూచించారు.

అనంతరం ప్రవీణ నాయుడు ప్రసంగిస్తూ ప్రపంచంలో రోజూ 690 మిలియన్ సంఖ్యలో ప్రజలు ఆహారం అందక ఇబ్బంది పడుతున్నారని అలానే 6.9 మిలియన్ ప్రజలు ఆకలితో చనిపోతున్నారని తెలిపారు. అయినప్పటికీ వినియోగించే ఆహారంలో 30 శాతం ఆహారం వృథా కావడం ఎంతో భాద కలిగించే అంశమని దీనిని అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు. చివరగా ప్రొఫెసర్ బి విద్యా సాగర్, జయశంకర్ తెలంగాణా స్టేట్ అగ్రికల్చర్ యూనివర్శిటీ వారు మాట్లాడుతూ మనం ఆహార ఉత్పత్తిలో స్వయం సమృద్ది సాధించినప్పటికీ దానిని కొనసాగించడం ఎంతో అవసరమన్నారు. అందుకోసం మన ప్రజలు, సమాజం ఇరువురూ కలసి మంచి వ్యవసాయ ఉత్పత్తి విధానాలపై పని చేయాల్సి ఉందని పిలుపునిచ్చారు. ప్రజలందరికీ సమాన స్థాయిలో ఆహారం అందేలా చర్యలు తీసుకొని అందుకు తగినట్లుగా మంచి వ్యవసాయ విధానాలను ప్రమోట్ చేయాలని అన్నారు. ఈకార్యక్రమంలో వేదుల సత్యన్నారాయణ, అపర్ణ నెమలికంటి, చీఫ్ డైటీషియన్, విరించి హాస్పిటల్స్ తో పాటూ పలువురు వైద్యులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News