Monday, January 20, 2025

కన్నెపల్లి పంప్‌హౌస్‌లో ఆరు మోటార్లతో నీటి ఎత్తిపోత

- Advertisement -
- Advertisement -

కాళేశ్వరం: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన కన్నెపల్లి పంప్‌హౌస్ నుండి ఆరు మోటార్లతో నీటిని ఎత్తి పోస్తున్నారు. రెండు రోజుల నుండి నీటి ఎత్తిపోత జరుగుతుంది. కన్నెపల్లి 11 పంపులు ఉండగా దానిలో ఆరు మోటార్లు ఆన్ చేసి నీటిని అన్నారం బ్యారేజ్‌కు విడుదల చేస్తున్నారు. 12మోటార్లు గాను, 1, 4, 5, 6, 7, 8 మోటార్లను ఆన్‌చేసి నీటి అన్నారం బ్యారేజి తరలిస్తున్నారు. ఇప్పటి వరకు కన్నేపల్లి పంప్‌హౌస్ నుండి 12708 క్యూసెక్కుల వరద నీరు అన్నారం బ్యారేజికి చేరినట్లు అధికారులు తెలిపారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా రెండవ లింకు సరస్వతి పంప్‌హౌస్ నాలుగు మోటార్లతో నీటిని ఎత్తిపోయేదా 11724 క్యూసెక్కుల నీరు సుందిళ్ల బ్యారేజ్‌కు ఎత్తిపోస్తున్నారు. అలాగే పార్వతి పంప్‌హౌస్ నుండి నాలుగు మోటార్లతో నీటిని పంపిస్తున్నారు. లక్ష్మీ బ్యారేజ్ వద్ద 12708 ఎగువకు ప్రస్తుతానికి ఆరు టిఎంసిల నీటి నిల్వలు ఉన్నాయి. అలాగే సరస్వతి బ్యారేజ్ వద్ద 7 టిఎంసిల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News